విజయ్ దేవరకొండ కి అప్పుడే లాభాలు వచ్చేసాయి!

టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండ్ ఏటంటే హీరోస్ ప్రొడ్యూసర్స్ గా మారడం. చాలామంది ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా యంగ్ హీరో విజయ్ [more]

Update: 2019-09-09 09:49 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండ్ ఏటంటే హీరోస్ ప్రొడ్యూసర్స్ గా మారడం. చాలామంది ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేరాడు. ఓ కొత్త డైరెక్టర్ తో డైరక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిన్న సినిమా చకచకా తీసి కంప్లీట్ కూడా చేసారు.

టీజర్ కు మంచి రెస్పాన్స్…

రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ని చూపిస్తూ విజయ్ ఈ సినిమాను మంచి ప్రాఫిట్స్ కి అమ్మేశాడు. ఈమూవీ టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు నైజాం ఏస్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్, రెండున్నర కోట్లు ఇచ్చి తీసుకున్నారు. ఈమూవీ కి అయిన బడ్జెట్ కూడా అంతే. ఇంకా నాన్ థియేటర్ హక్కులు విజయ్ దేవరకొండ దగ్గర వున్నాయి. అవి త్వరలోనే అమ్మనున్నాడు. ఒకవేళ అవి అమ్మితే అవి మొత్తం లాభాలే.

అనసూయ నటన…

విజయ్ సినిమా లో తరుణ్ భాస్కర్ హీరో కాబట్టి సినిమాకు మంచి రేట్స్ వచ్చే అవకాశముంది. సినిమాకి బడ్జెట్ తెచ్చే విషయంలో విజయ్ కి మించిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి! చిన్న అమౌంటే కాబట్టి పెట్టిన పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్ కి త్వరగానే వచ్చేస్తుంది. పైగా ఇందులో అనసూయ కూడా ఉంది. ఈమధ్య ఆమె మంచి కథ అయితే నే సినిమాలు చేస్తుంది. ఇక ఈమూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాల్సిఉంది.

 

Tags:    

Similar News