విజయ్ "వారిసు" అఫీషియల్ ట్రైలర్.. ఒక్క గంటలో 4.8 మిలియన్ వ్యూస్

తన కుటుంబ ప్రతిష్టను కాపాడుకునేందుకు విజయ్ తీసుకున్న బాధ్యతలు.. అవి నెరవేర్చే క్రమంలో..;

Update: 2023-01-04 13:01 GMT
varisu trailer, vamsi paidipally, prakash raj
  • whatsapp icon

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా.. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు గా విడుదలకు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా నుండి అఫీషియల్ ట్రైలర్ ను వదిలారు. ఈ ట్రైలర్ ను చూస్తే.. ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా అని అర్థమవుతుంది. శరత్ కుమార్ విజయ్ కు తండ్రిగా కనిపించనున్నారు. సీనియర్ నటుడు సుమన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కిక్ శ్యామ్, జయసుధ, సంగీత తదితర భారీ తారాగణంతో వారిసు ని రూపొందించారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు చూస్తే.. ఈ సినిమాలో విజయ్ లుక్ అల్ట్రా స్టైలిష్ గా ఉండబోతోందని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి తనదైన మార్క్ కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్‌లోనే చూపెట్టాడు. తన కుటుంబ ప్రతిష్టను కాపాడుకునేందుకు విజయ్ తీసుకున్న బాధ్యతలు.. అవి నెరవేర్చే క్రమంలో ఎదురైన సవాళ్లను సినిమాలో చూపించబోతున్నారు. విజయ్ కు జోడీగా.. రష్మిక మందన్న నటించగా.. తమన్ సంగీతాన్ని అందించారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ తమిళ్ వర్షన్. తెలుగు వర్షన్ ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు.
Full View




Tags:    

Similar News