ఫిబ్రవరి 17న ''వినరో భాగ్యము విష్ణుకథ''
ఈ ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్... ఆ తర్వాత జూలైలో టీజర్ విడుదల చేశారు. చిత్తూరు నేపథ్యంలో..
ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ సమర్పణలో.. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతోన్న సినిమా ''వినరో భాగ్యము విష్ణుకథ''. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకి మురళీ కిశోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. శివరాత్రి కానుకగా.. ఫిబ్రవరి 17న సినిమాను విడుదల ప్రకటిస్తూ 'శివరాత్రికి మా విష్ణను కలవండి' అని యూనిట్ పేర్కొంది.
ఈ ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్... ఆ తర్వాత జూలైలో టీజర్ విడుదల చేశారు. చిత్తూరు నేపథ్యంలో ఏడుకొండల వెంకన్న సాక్షిగా తిరుమల తిరుపతి కొండల కింద జరిగే కథతో రూపొందుతోన్న ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలు విడుదలైనా.. ఊహించిన స్థాయిలో అలరించలేకపోయాడు. సినిమా విడుదల తేదీ వెల్లడించిన సందర్భంగా ఒక స్టిల్ వదిలారు. అది చూస్తే.. దండం పెడుతున్న కిరణ్ అబ్బవరం, అతని చుట్టూ గన్స్ పట్టుకుని, సేమ్ కలర్ డ్రస్సులో ఉన్న కొందరు విలన్లు. తిరుపతి నేపథ్యంలో కథలో ఆ గన్స్ ఏంటి? అనేది ఆసక్తి కలిగిస్తోంది. కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది.