ఓవర్సీస్ లో వినయ విధేయకు ఇబ్బందే
తెలుగు సినిమాలకే కాదు.. ఏ భాషా చిత్రాలకైనా ఓవర్సీసీ మార్కెట్ చాలా ముఖ్యమైనది. ఇక తెలుగు సినిమాలకు ఓవర్సీసీ మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ [more]
తెలుగు సినిమాలకే కాదు.. ఏ భాషా చిత్రాలకైనా ఓవర్సీసీ మార్కెట్ చాలా ముఖ్యమైనది. ఇక తెలుగు సినిమాలకు ఓవర్సీసీ మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ [more]
తెలుగు సినిమాలకే కాదు.. ఏ భాషా చిత్రాలకైనా ఓవర్సీసీ మార్కెట్ చాలా ముఖ్యమైనది. ఇక తెలుగు సినిమాలకు ఓవర్సీసీ మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలు ఓవర్సీస్ లో ఓవర్ గా కలెక్షన్స్ కొల్లగొడతాయి. ఇక బాహుబలి ఓవర్సీస్ లో సెట్ చేసిన ఫిగర్ ని టచ్ చెయ్యడానికి చాలా బాలీవుడ్ మూవీస్ పోటీపడ్డాయి. కానీ బాలీవుడ్ మూవీస్ ఏవి ఓవర్సీస్ కలెక్షన్స్ బాహుబలి రేంజ్ లో కొల్లగొట్టలేకపోయాయి. ఇక ఓవర్సీస్ లో క్రేజీ కాంబోలో తెరకెక్కే సినిమాలకు బోలెడంత మార్కెట్ ఉంటుంది. అందులోను త్రివిక్రమ్ సినిమాలన్నా.. సుకుమార్ సినెమాలన్నా ఓవర్సీసీ ప్రేక్షకులకు భలే ఇష్టం.
ఇక ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలనైతే ఓవర్సీస్ ప్రేక్షకులు దేవుళ్ళ మాదిరి ఆదరిస్తారు. తాజాగా బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయరామ, పెటా, ఎఫ్ టు చిత్రాలు ఓవర్సీస్ లోను భారీగా పోటీ పడుతున్నాయి. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు కి ఓవర్సీస్ లో భారీ క్రేజుంది. అలాగే కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిస్తున్న ఎఫ్ టు కి కూడా ఓవర్సీస్ ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. కాకపోతే రామ్ చరణ్ – బోయపాటిల వినయ విధేయరామ కి ఓవర్సీస్ లో ఓ అన్నంత క్రేజ్ అయితే కనబడ్డం లేదు.
ఎన్టీఆర్ ప్రీమియర్స్ కి వచ్చే స్పందన వినయ విధేయరామకి ఉండకపోవచ్చని… రామ్ చరణ్ ని పక్కా మాస్ గా చూపించబోవడమే కాదు.. బోయపాటి సినిమాలంటే ఓవర్సీస్ ప్రేక్షకులకు అంతగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే బోయపాటి సినిమాల్లో మాస్ మాస్ అంటూ హీరోలు ఎక్కువగా యాక్షన్ కే పరిమితమవుతుంటారు. తాజాగా వినయ విధేయరామ కూడా యాక్షన్ ఎంటెర్టైనెర్ గానే తెరకెక్కడంతో.. వినయ విధేయరామ మీద ఓవర్సీస్ ప్రేక్షకులను ఇంట్రెస్ట్ కలగడం లేదనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. కాకపోతే రంగస్థలం సినిమా తో రామ్ చరణ్ మర్కెట్ ఓవర్సీస్ లో భారీగా పెరిగింది. కానీ బోయపాటి వలన ఇపుడు వినయ విధేయరామ కి ఓవర్శిస్ లో అనుకున్నంత క్రేజ్ రావడం లేదని అక్కడి ప్రేక్షకుల మాట.