వారిని నిర్మాత ఆదుకుంటున్నాడా..?

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో డీవీవీ దానయ్య.. వినయ విధేయ రామ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. భారీ బడ్జెట్ పెట్టిన ఈ సినిమాకి [more]

Update: 2019-01-23 07:10 GMT

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో డీవీవీ దానయ్య.. వినయ విధేయ రామ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. భారీ బడ్జెట్ పెట్టిన ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ లేవల్లోనే జరిగింది. రామ్ చరణ్ కి రంగస్థలంతో ఉన్న బెంచ్ మార్క్ ఈ వినయ విధేయ రామకి బాగా ఉపయోగపడింది. అందుకే వినయ విధేయ రామ సినిమాలో మాస్ పాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ.. రామ్ చరణ్ కి రంగస్థలంతో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని బయ్యర్లు భారీ ధరకు సినిమాని కొన్నారు. తీరా చూస్తే సినిమాకి డివైడ్ టాక్ రావడంతో ఇప్పుడు బోరుమంటున్నారు. దాదాపుగా వినయ విధేయ రామకి ఫైనల్ రన్ లో 30 కోట్ల నష్టం తప్పదనే టాక్ నడుస్తోంది. అయితే, నిర్మాత ఒక డిస్ట్రిబ్యూటర్ కి కొంత మొత్తం వెనక్కి ఇచ్చినట్టుగా ఫిలింనగర్ టాక్. రంగస్థలం సినిమాతో ఓవర్సీస్ లో సంచలనాలు క్రియేట్ చేసిన రామ్ చరణ్.. తదుపరి చిత్రం కూడా దున్నేస్తుందనుకున్నారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్. రంగస్థలం జోనర్ వేరు.. వినయ విధేయ రామ జోనర్ వేరు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించినా ఓవర్సీస్ లో మాత్రం గట్టిగానే దెబ్బతీసింది.

ఎంతోకొంత వెనక్కు ఇచ్చేస్తున్న దానయ్య

గతంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఓవర్సిస్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మార్కెట్ ను క్రియేట్ చేస్తే.. వినయ విధేయ రామ మాత్రం ఘోరమైన కలెక్షన్స్ తెచ్చిన చిత్రంగా ఓవర్సీస్ రికార్డులకెక్కింది. అయితే అక్కడ రామ్ చరణ్ క్రేజ్ తో వినయ విదేయ రామని కొన్న డిస్ట్రిబ్యూటర్ కి బాగా నష్టాలు రావడంతో.. నిర్మాత దానయ్య ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కి 50 లక్షల వరకు వెనక్కు ఇచ్చేశారని టాక్. కేవలం ఓవర్సీస్ మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల బయ్యర్లకు కూడా దానయ్య ఎంతో కొంత మొత్తాన్ని వెనక్కిచ్చేయాలని చూస్తున్నట్లుగా వినికిడి.

Tags:    

Similar News