ప్రియా ప్రకాష్ అలా ఎందుకు చేసింది!!

మలయాళ హీరోయిన్ ప్రియా ప్రకాష్ ఓరు ఆధార్ లవ్ సినిమాతో బాగా క్రేజీ గా తయారైంది. ఆ సినిమాలో ప్రియా ప్రకాష్ చేసింది ఏం లేదుకానీ…. తర్వాత [more]

Update: 2020-05-20 04:38 GMT

మలయాళ హీరోయిన్ ప్రియా ప్రకాష్ ఓరు ఆధార్ లవ్ సినిమాతో బాగా క్రేజీ గా తయారైంది. ఆ సినిమాలో ప్రియా ప్రకాష్ చేసింది ఏం లేదుకానీ…. తర్వాత ప్రియా ప్రకాష్ కి మంచి మంచి అవకాశాలే వచ్చాయి. టాలీవుడ్ లో అయితే ప్రియా ప్రకాష్ కి అల్లు అర్జున్ తన సినిమాల్లో అవకాశం ఇస్తాడని అన్నారు. కానీ లేదు. అయితే బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న ప్రియా ప్రకాష్ కరోనా లాక్ డౌన్ లో ఇంట్లోనే గడుపుతుంది. తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ చేసిన ఓ పనికి ఆమె అభిమానులంతా షాకవుతున్నారు. గత కొంతకాలంగా ప్రియా ప్రకాష్ ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ చేసి ఇన్స్టా పేజీ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అంతేగాకుండా ప్రియా ఈమధ్యన టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే తాజాగా ప్రియా ప్రకాష్ ఉన్నట్టుండి ఇన్స్టా నుండి వైదొలిగింది. ఉన్నట్టుండి ప్రియా ప్రకాష్ ఇలా ఇన్స్టా నుండి ఎందుకు వెళ్లిపోయిందో అంటూ ఆమె అభిమానులు షాకవుతున్నారు. అసలు ఇన్స్టా నుండి ఆమె ఎందుకు వైదొలిగిందా అని.. దానికి కారణం ఏమిటా అని ఆమె అభిమానులు కొట్టుకుంటున్నారు. అయితే ప్రియా ప్రకాష్ వారియర్ చేసిన కొన్ని వీడియోస్ నెటిజెన్స్ కి నచ్చక.. అభ్యంతరాలు తెలిపారని అందుకే ప్రియా ప్రకాష్ ఇలా ఇన్స్టా నుండి వైదొలిగింది అని అంటున్నారు. ఇక ఇన్స్టా నుండి బయటికొచ్చిన ప్రియా ప్రకాష్ ఫేస్ బుక్, టిక్ టాక్ లలో అభిమానులకు చేరువలోనే ఉంది.

Tags:    

Similar News