వాల్మీకి రిలీజ్ అవుతుందా?

వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ తో నటించిన చిత్రం వాల్మీకి మరి కొన్ని రోజుల్లో అంటే ఈనెల 20 న రిలీజ్ కానుంది.  మొదట ఈ మూవీ [more]

Update: 2019-09-14 06:34 GMT

వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ తో నటించిన చిత్రం వాల్మీకి మరి కొన్ని రోజుల్లో అంటే ఈనెల 20 న రిలీజ్ కానుంది. మొదట ఈ మూవీ 13 న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ అదే రోజు గ్యాంగ్ లీడర్ ఉండడంతో ఎందుకులే పోటీ అని పక్కకి తప్పుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు మరో చిక్కు ఎదురైంది. ఈ సినిమా యొక్క టైటిల్ పై ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. ఇటువంటి టైటిల్ ని ఇలాంటి క్రూర‌త్వం నిండిన‌ సినిమాకి ఎలా పెడతారు? అంటూ విరుచుకుప‌డుతున్నారు.

చిక్కులు తొలగేనా….?

దీనిపై హరీష్ శంకర్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. సినిమా మొత్తం చూశాక అర్ధం అవుతుంది అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టామో అని చెప్పాడు. అయినా కానీ వాల్మీకి క‌మ్యూనిటీ పేరుతో రాజ‌కీయ నాయ‌కులు ఇంకా రచ్చ ఆపలేదు. ఈ ఇష్యూ మొత్తం కోర్ట్ లో నడుస్తుంది. అయితే కోర్ట్ మాత్రం ఫిలింఛాంబ‌ర్- సెన్సార్ బృందం స‌హా అంద‌రికీ నోటీసులు పంపడం చూస్తుంటే అస‌లేం జ‌రుగుతోంది? అన్న సందిగ్ఢం క‌లుగుతోంది. ఇంతకీ ఈ మూవీ అనుకున్న డేట్ కి రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై చిత్ర‌యూనిట్ అధికారికంగా ఏదైనా వివ‌ర‌ణ ఇస్తుందేమో చూడాలి.

 

Tags:    

Similar News