7 రోజుల్లో రూ.700 కోట్లు.. RRRను కేజీఎఫ్ 2 బీట్ చేస్తుందా ?

నిన్నటికి సినిమా విడుదలై వారంరోజులు పూర్తి కాగా.. ఏడ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.;

Update: 2022-04-21 13:33 GMT

హైదరాబాద్ : యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కేజీఎఫ్ 2. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తొలిరోజే రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది. మాతృకంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ కేజీఎఫ్ 2 కలెక్షన్స్ దూసుకెళ్తున్నాయి. హిందీ వెర్షన్ లో ఈ సినిమా రూ.300 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.

నిన్నటికి సినిమా విడుదలై వారంరోజులు పూర్తి కాగా.. ఏడ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా విడుదలైన తొలివారంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన లిస్ట్ లో బాహుబలి 2 ముందుండగా..తర్వాతి స్థానంలో కేజీఎఫ్ 2 నిలిచింది. ఆర్ఆర్ఆర్ విడుదలై మూడు వారాలు అవ్వగా.. ఇప్పటి వరకూ రూ. 1050 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఆర్ఆర్ఆర్ రికార్డును కేజీఎఫ్ 2 బీట్ చేస్తుందని యశ్ అభిమానులు అంటున్నారు.


Tags:    

Similar News