కొత్త ఇల్లు కొన్న షణ్ముఖ్ జశ్వంత్

కొత్త ఇంటిని కొనుగోలు చేసిన షన్నూ.. తన స్నేహితులతో కలిసి గృహప్రవేశం కూడా కానిచ్చేశాడు. అయితే ఈ ఇల్లు తన కుటుంబంతో;

Update: 2022-02-09 05:11 GMT

ప్రముఖ యూ ట్యూబర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ చాలా మందికి సుపరిచితుడే. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు నుంచే అతను ఎక్కువ సబ్ స్క్రైబర్స్ కలిగిన యూ ట్యూబర్ గా రికార్డు సృష్టించాడు. షార్ట్ ఫిలింస్ తో అందరినీ మెప్పిస్తూ.. ఇప్పుడు వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. షన్నూ చేసిన వెబ్ సిరీస్ లకు రికార్డుస్థాయిలో వ్యూస్ రావాల్సిందే. అంత బాగుంటాయి. తాజాగా షన్నూ ఓ ఇంటివాడయ్యాడు.

కొత్త ఇంటిని కొనుగోలు చేసిన షన్నూ.. తన స్నేహితులతో కలిసి గృహప్రవేశం కూడా కానిచ్చేశాడు. అయితే ఈ ఇల్లు తన కుటుంబంతో కలిసి ఉండేందుకు కాదని సమాచారం. కేవలం తన వర్క్స్ చూసుకోవడానికి, తను మాత్రమే ఉంటూ.. స్నేహితులతో గడపడానికి కొత్త ఇల్లును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల షన్నూ - దీప్తి సునయనతో బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. బ్రేకప్ తర్వాత షన్ను తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.






Tags:    

Similar News