యాత్ర పై బజ్ లేదు కానీ

సినిమా పై అంచనాలు ఉంటె మంచిదే. కానీ అది కొన్నికొన్ని సార్లే. సినిమాపై మరీ అంచనాలు ఎక్కువ అయిపోతే సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశముంది. సినిమాలో ఎక్కడో [more]

Update: 2019-02-04 03:26 GMT

సినిమా పై అంచనాలు ఉంటె మంచిదే. కానీ అది కొన్నికొన్ని సార్లే. సినిమాపై మరీ అంచనాలు ఎక్కువ అయిపోతే సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశముంది. సినిమాలో ఎక్కడో కొంచం తేడా కొట్టిన ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుంది. కొన్నిసార్లు ఎక్సపెక్టషన్స్ లేకుండా వచ్చిన సినిమాలు సక్సెస్ అయినా దాఖలు కూడా ఉన్నాయి. మహానటి అదే కోవకి చెందింది.

ఈసినిమా వచ్చేవరకు పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కానీ సినిమా వచ్చాక సినిమా చూసి ఔరా అనుకున్నారు. ఇక సంక్రాంతికి రిలీజ్ అయినా ఎన్టీఆర్ కథానాయకుడు పై ముందు నుండే బారి అంచనాలు ఉన్నాయి. సినిమాలో విషయం లేకపోవడంతో ఎమోష‌న్లు వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం చేటు చేసింది. మరి మహానాయకుడు పరిస్థితి ఏంటో చూడాలి. ఈసినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అయితే లేవు.

ఇక టాలీవుడ్ లో మరో బయోపిక్ రానుంది. అదే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద తీసిన “యాత్ర‌”. ఈసినిమా పై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే వైఎస్ ఏమీ సినిమా వాడు కాదు కాబ‌ట్టి.. గ్లామ‌ర్ ట‌చ్ మిస్స‌యింది.అందులోనూ ఇది ప్ర‌ధానంగా వైఎస్ పాద‌యాత్ర నేప‌థ్యంలో సాగే చిత్రం. దాంతో ఈసినిమాపై అంతగా బజ్ లేదు. అయితే డైరెక్టర్ మ‌హి.వి.రాఘ‌వ్ ఒక క‌న్విక్షన్‌తో ఈ సినిమా తీశాడు. ఇది వైఎస్ సినిమాగా కాకుండా మామూలుగా చూసినా ఇది న‌చ్చే సినిమా అంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మ‌మ్ముట్టి నటించారు.

Tags:    

Similar News