సుక్కు – బన్నీ స్టోరీ లీక్?

అలా వైకుంఠపురములో హిట్ తర్వాత బన్నీ సుకుమార్ సినిమా కోసం స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ సినిమా కోసం అల్లు అర్జున్ గుబురు గెడ్డం, [more]

Update: 2020-02-22 07:53 GMT

అలా వైకుంఠపురములో హిట్ తర్వాత బన్నీ సుకుమార్ సినిమా కోసం స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ సినిమా కోసం అల్లు అర్జున్ గుబురు గెడ్డం, వత్తైన జుట్టు లుక్ లో కనిపించడానికి ప్రిపేర్ అవుతున్నాడు. చిత్తూరు కుర్రాడిగా అల్లు అర్జున్ బాగా రూఫ్ గా కనిపిస్తాడని న్యూస్ ఉంది. అలాగే అల్లు అర్జున్ పాత్ర ఈ సినిమాలో కాస్త నెగెటివ్ గా ఉంటుంది అని.. అది కూడా కాసేపే ఉంటుంది కానీ తర్వాత హీరోయిజం బయటికొచ్చేస్తుందట. ఇక నెగటివ్ పాత్ర కోసం అల్లు అర్జున్ నేచురల్ లుక్ కోసం కష్టపడుతున్నాడట.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ బన్నీ విలనిజం, హీరోయిజం మీదే ఉంటుందట. బన్నీ ఎర్రచందనం స్మగ్లర్స్ ని పట్టుకోవడానికి స్మగ్లింగ్ చేస్తూ.. తాను స్మగ్లర్ గానే కనిపిస్తాడట.అలాగే ఎర్రచందనం ఎక్సపర్ట్ చేసేటప్పుడు బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తాడని… అందులోనే స్మగ్లింగ్ చేసేవారిని పోలీస్ ఆఫీసర్ గా రివీల్ అయ్యి ఎవరిని పట్టుకుంటాడట. ఇక ఈ సినిమాలో అడవుల్లో జరిగే యాక్షన్ సన్నివేశాలను సుకుమార్ బ్రహ్మాండంగా చూపించబోతున్నాడట. ఇక రష్మిక కేరెక్టర్ కి కూడా రంగస్థలం సినిమాలో సమంత పాత్రకి ధీటుగా చూపించబోతున్నాడట. ఇక యాంకర్ అనసూయ పాత్ర కూడా బందిపోటు రాణి తరహాగా ఉండబోతుంది.

Tags:    

Similar News