30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ రివ్యూ

30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ రివ్యూబ్యానర్: SV ప్రొడక్షన్స్ నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్, హర్ష, బ్రహ్మం, పోసాని, హేమ, హైపర్ ఆది తదితరులు సినిమాటోగ్రఫీ: శివేంద్ర [more]

Update: 2021-01-29 10:23 GMT

30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ రివ్యూ
బ్యానర్: SV ప్రొడక్షన్స్ 
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్, హర్ష, బ్రహ్మం, పోసాని, హేమ, హైపర్ ఆది తదితరులు 
సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరధి
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ 
మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్
నిర్మాత:సుంకర రామబ్రహ్మం 
దర్శకత్వం: మున్నా 

బుల్లితెర మీద యాంకర్ గా ఎదురు లేదు.. మంచి ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులని కట్టిపడేసే ప్రదీప్ మాచిరాజు  జీ తెలుగు, ఈ టివి లలో పాపులర్ షోస్ తో అందరికి పరిచయం ఉన్న ప్రదీప్ మాచిరాజు ఓన్ ప్రొడక్షన్ లో కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను అంటూ సెలెబ్రిటీ షో కూడా చేసాడు. బుల్లితెర మీద ఎదురు లేని ప్రదీప్ మాచిరాజు పలు సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను పరిచయస్తుడే. మున్నా అనే దర్శకుడితో ప్రదీప్ వెండితెరకు హీరోగా పరిచయమవుతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాక్ డౌన్ ముందే విడుదల కావాల్సిన ఈ సినిమాకి ఓటిటి, ఏటిటి ఆఫర్స్ ఎన్ని వచ్చినా నిర్మాతలు ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామంటూ కూర్చుని.. నేడు సోలో గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాని థియేటర్స్ లో విడుదల చేసారురు. మరి బుల్లితెర మీద సక్సెస్ అయిన ప్రదీప్ వెండితెర మీద హీరోగా ఎంతవరకు సక్సెస్ అయ్యాడో సమీక్షలో చూసేద్దాం.
కథ:
1947లో అబ్బాయి గారు (ప్రదీప్ మాచిరాజు) మరియు అమ్మాయి గారు (అమృత అయ్యర్) పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కాని అబ్బాయ్ గారిని చంపేస్తారు. అమ్మాయి గారు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. వారిద్దరూ మళ్ళీ అర్జున్(ప్రదీప్) మరియు అక్షర(అమృత) గా పుడతారు. అర్జున్‌కు బాక్సింగ్ అంటే ప్రాణం.. అక్షరకు అక్క అంటే ప్రాణం. అర్జున్, అక్షరలు ఇద్దరూ వైజాగ్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతారు. అర్జున్ కి అక్షరకి ఒక్క క్షణం పడదు. ఒకరిని చూసి ఒకరు అస్సహించుకుంటారు. మొదటి పరిచయం నుండే కొట్లాడుకునే అర్జున్, అక్షరలు తమ పూర్వ జన్మ గురించి తెలుసుకుంటారా?అసలు అర్జున్ కి అక్షరకి పూర్వ జన్మ గురించి తెలుసుకునే అవకాశం వచ్చిందా? అర్జున్ – అక్షరలు ప్రేమించుకుంటారా? వారిద్దరూ అసలు కలుస్తారా? అనేది మిగతా కథ.. 
నటుల పెరఫార్మెన్స్:
ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా ఓకె.  హీరోగా కూడా పర్లేదు. లుక్స్ లోను ఫిజిక్ లోను ప్రదీప్ మంచి మార్కులే కొట్టేసాడు. కాకపోతే కొన్నిచోట్ల హీరోయిన్ అమృత అయ్యర్ ముందు తేలిపోయాడు. హీరోయిన్ అమృత అయ్యర్ ఎక్స్‌ప్రెషన్స్ లో అదరగొట్టేసింది. లుక్స్ పరంగాను అమృతకి మంచి మార్కులే పడతాయి. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అమృత నటన అని చెప్పొచ్చు.  హర్ష కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. భద్రం, సమీర్, శుభలేక సుధాకర్, పోసాని, హేమ మిగతా వారు పరిధి మేర మెప్పించారు.
విశ్లేషణ:
పూర్వ జన్మలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకోవడం.. అనుకోని కారణాలతో కలవకుండానే ప్రాణాలు పోగొట్టుకోవడం.. మళ్ళీ తిరిగి జన్మించి ఆ ఓడిపోయిన ప్రేమను గెలిపించుకోవడం అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు, ఇలాంటి ప్రేమ కథలు అనేకం వచ్చాయి. అందులో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలాగే డిజాస్టర్స్ అయిన సినిమాలు ఉన్నాయి. అలాంటి పూర్వ జన్మల కథని తాను వెండితెరకు లాంచ్ అవ్వబొయె సినిమాకోసం ఎంచుకున్నాడు ప్రదీప్. అయితే ప్రదీప్ తీసుకున్న లైన్ ఓకె అయినా.. దర్శకుడు దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యడంలో తడబడ్డాడు. కోపంతో చనిపోయి మళ్లీ పుట్టడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కాలేజ్ లో అక్షర -ఆర్జున్ గిల్లి కజ్జాలు, కలహాలతో కానిచ్చేసిన దర్శకుడు ఇంటర్వెల్ సీన్ లో ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. ఆ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై అంచనాలు పెరిగిపోతాయి. కానీ సెకండ్ హాఫ్ ఊహించుకున్నంత లేదు. కథ నెమ్మదించడం. స్క్రీన్ ప్లే స్లో అవడంతో.. రెండు మూడు సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నా సినిమాలో ప్రేక్షకుడు అంతగా ఇన్వాల్వ్ అవ్వలేడు. సెకండ్ హాఫ్ లో అక్క ఎమోషనల్ సీన్ తప్ప మిగిలిన సీన్స్ అన్ని పేలవంగా అనిపిస్తాయి. అంతేకాదు క్లైమాక్స్ ఈజీగా తేల్చేసినట్లు అనిపిస్తుంది. దర్శకుడు ట్రీట్మెంట్ పై ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
సాంకేతికంగా..
ఈ సినిమాకు ఓకె ఒక్క ప్లస్ పాయింట్ అనూప్ రూబెన్స్ సంగీతం. నీలినీలి ఆకాశం మాత్రమే కాదు, అన్ని పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అనూప్ రూబెన్స్ అందించిన నేపధ్య సంగీతము బావుంది. చాలా సన్నివేశాలు అదుర్స్ అనిపించాయి. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. ఎడిటింగ్ వీక్ అంటే చాల వీక్. సెకండాఫ్ ఇంకా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.
రేటింగ్: 1.75/5

Tags:    

Similar News