గాలి సంపత్ మూవీ రివ్యూ

గాలి సంపత్ మూవీ రివ్యూనటీనటులు: శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, రాజేంద్ర ప్రసాద్, సత్య, రఘు బాబు, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ళ భరణి తదితరులుమ్యూజిక్ డైరెక్టర్: అచ్చు [more]

Update: 2021-03-11 15:33 GMT

గాలి సంపత్ మూవీ రివ్యూ
నటీనటులు: శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, రాజేంద్ర ప్రసాద్, సత్య, రఘు బాబు, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ళ భరణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: అచ్చు  
ఎడిటింగ్: తమ్మిరాజు 
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ 
నిర్మాతలు: కృష్ణ, సాహు, గారపాటి, హరీష్ పెద్ది 
దర్శకత్వం: అనీష్ కృష్ణ  
విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా.. కామెడీ ఎక్సప్రెషన్స్ తో అదిరిపోయే పెరఫార్మెన్స్ చేసే శ్రీ విష్ణు కాంబో లో సినిమా అనగానే అందరిలో క్యూరియాసిటీ ఉంటుంది. అందులోనూ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కర్త, కర్మ, క్రియ అన్నట్టుగా తెరకెక్కి, పబ్లిసిటీ చేసిన సినిమా అంటే అందరిలో ఆటోమాటిక్ గా క్యూరియాసిటీ పెరగడం ఖాయం. మరి అనిల్ రావిపూడి సమర్పణలో అనీష్ కృష్ణ దర్శకుడిగా రాజేంద్ర ప్రసాద్ – శ్రీ విష్ణు తండ్రి కొడుకులుగా నటించిన గాలి సంపత్.. నేడు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుండి పబ్లిసిటీ విషయంలో సినిమాపై ఆసక్తి పెంచడం, ట్రైలర్ లో కామెడీ, ఎమోషన్ అన్ని పర్ఫెక్ట్ గా కనిపించడంతో గాలి సంపత్ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి ప్రేక్షకుల అంచనాలను గాలి సంపత్ అందుకున్నాడా? లేదా? అనేది సమీక్షలో చూసేద్దాం.
కథ:
గాలి సంపత్(రాజేంద్ర ప్రసాద్)నోటి నుండి మాట కాకుండా గాలి మాత్రమే వస్తుంది. పీపీ.. ఫాఫాఫా భాషతో మాట్లాడుతుంటాడు. సంపత్ గాలి మాటలకు ట్రాన్సలేటర్ గా కమెడియన్ సత్య ఉంటాడు. సంపత్ తన కొడుకు సూరి(శ్రీ విష్ణు) కి ఓ బహుమతి ఇవ్వాలనుకుంటాడు. మాటలు రాకపోయినా సరే సైగలతోనైనా నాటకాల్లో గెలవాలని విపరీతంగా కష్టపడుతుంటాడు. తండ్రి కొడుకులు కలిసున్నా చిన్న చిన్న అపార్ధాలు, గొడవలు జరుగుతుంటాయి. ఒకసారి తనని తండ్రే ఎదగనియ్యడం లేదనుకునే అపోహలో తండ్రితో పెద్దగా గొడవ పడుతుంటాడు సూరి. దానితో బాగా హార్ట్ అయిన సంపత్ అనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకుంటాడు. అసలు గాలి సంపత్ కి ఎదురైన ప్రమాదం ఏమిటి? మాట్లాడలేని సంపత్ ఆ ప్రమాదం నుండి ఎలా బయట పడ్డాడు? సూరి కన్నతండ్రిని అర్ధం చేసుకుంటాడా? తండ్రి జాడ కోసం సూరి ఏం చేసాడు? అనేది మిగతా కథ.
పెరఫార్మెన్స్:
శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరూ కథని తమ భుజాల మీదే మోశారు. గాలి సంపత్ గా రాజేంద్ర ప్రసాద్ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం అన్నంతగా పెరఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన. గాలీ సంపత్ ఆయన ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సూరి గా శ్రీవిష్ణు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. తండ్రి కొడుకులుగా ఎమోషనల్ నటనతో ఇద్దరి పెరఫార్మెన్స్ అదిరింది. శ్రీవిష్ణు ఫేస్ ఎక్సప్రెషన్స్ లోనూ, ఎమోషనల్ గానూ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ లవ్లీ సింగ్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో అందంతో ఆకట్టుకుంది. సత్య కామెడీ అక్కడక్కడా ఆకట్టుకుంది. మిగతా వారు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:దర్శకుడు అనీష్ కృష్ణ తండ్రి కొడుకులు మధ్యన సాగె ఎమోషనల్ డ్రామాగా ఈ గాలి సంపత్ సినిమాని తెరకెక్కించాడు. కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కథలో ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పినా అనిల్ మార్క్ కామెడీ అక్కడక్కడా కథలో మిళితమైంది. తండ్రి కొడుకుల ఎమోషనల్ డ్రామా కథ లో కామెడీ పర్ఫెక్ట్ గానే సెట్ అయినా.. అనవసరమైన ఎపిసోడ్లు మరియు హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్ లు ఫస్ట్ హాఫ్ లో ఇబ్బంది పెట్టాయి. గాలి సంపత్ ఎంట్రీ, ఆయన పీపీ.. ఫాఫా భాష, సత్య మార్క్ కామెడీ అన్ని ఫస్ట్ హాఫ్ లో కామెడిని పండించాయి. ఇంటర్వెల్ ముందు ఎమోషనల్ గా ఆకట్టుకున్నా.. సెకండ్ హాఫ్‌లో కామెడీపై డ్రామా ఆధిపత్యం చెలాయించినప్పటికీ.. రాజేంద్ర ప్రసాద్ తన నటనతో ప్రేక్షకులని కట్టిపడేసాడు. సెకండ్ హాఫ్ లో మెయిన్ హైలెట్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ నూతిలో నుండి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు అన్ని హైలెట్ అనేలా ఉన్నాయి. దర్శకుడు అనీష్ ఈ విషయాన్ని చక్కగా హ్యాండిల్ చేసాడనిపిస్తుంది. శ్రీనివాస్ రెడ్డి పాత్రలో మూఢభక్తి సన్నివేశాలు మెప్పిస్తాయి. కానీ కథ లో చాలా సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకి తగ్గట్టుగా ముందే అర్ధమైపోతుండడమే సినిమాకి మైనస్. ఇక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటన, ఫస్ట్ హాఫ్ లో కామెడీ, క్లయిమాక్స్ సన్నివేశాలు హైలెట్ గా నిలిస్తే.. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సినిమాకి మైనస్ గా నిలిచాయి.  
సాంకేతికంగా:
చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగులో సంగీతం ఇచ్చిన అచ్చు మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. రాజేంద్ర ప్రసాద్ పై కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాక్రౌండ్ స్కోర్ అదిరింది. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్. అరుకు అందాలను అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి.

రేటింగ్:2.75/5

Tags:    

Similar News