ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ

బ్యానర్: పూరి కనెక్ట్స్ నటీనటులు: రామ్ పోతినేని, నాభ నటాషా, నిధి అగర్వాల్, సత్య దేవ్, పునీత్, దీపక్ శెట్టి, సాయాజీ షిండే, గెటప్ శ్రీను తదితరులు. [more]

Update: 2019-07-18 09:37 GMT

బ్యానర్: పూరి కనెక్ట్స్
నటీనటులు: రామ్ పోతినేని, నాభ నటాషా, నిధి అగర్వాల్, సత్య దేవ్, పునీత్, దీపక్ శెట్టి, సాయాజీ షిండే, గెటప్ శ్రీను తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటింగ్: జునైద్ సిద్దిక్వి
ప్రొడ్యూసర్స్: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: పూరి జగన్నాధ్

రెడీ, నేను శైలజ లాంటి హిట్ సినిమాలు చేసిన రామ్.. కెరీర్లో యావరేజ్ హిట్స్ ఎక్కువ… ప్లాప్స్ తక్కువ ఉన్నాయి. గత కొన్నాళ్లుగా యావరేజ్ లతోనే సరిపెట్టుకుంటున్న రామ్ హైపర్, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే చిత్రాలు హిట్ ఇస్తాయనుకుంటే.. అవి కూడా రామ్ కి యావరేజ్ లే మిగిల్చాయి. ఉన్నది ఒకటే జిందగీలో స్నేహితుడు కోసం ప్రేమనే త్యాగం చేసే పాత్రలో రామ్ నటన సూపర్. అలాగే హలొ గురు ప్రేమకోసమే లో తన తల్లి స్నేహితుడు కూతుర్ని ప్రేమించే విషయంలో ఆ తల్లి స్నేహితుడు ప్రకాష్ రాజ్ తో కలిసి ట్రావెల్ చేసే కుర్రాడిగా రామ్ నటన ఆకట్టుకుంది. అయితే రామ్ ఎన్ని సినిమాలు చేసినా మొదట్లో సుకుమార్ దర్శకత్వంలో చేసినా జగడం లాంటి పాత్ర మాత్రం చెయ్యలేదు . ఎప్పుడూ స్టూడెంట్ లుక్ లోనే, అల్ల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడి గానో, లేదంటే జాబ్ చేసే కుర్రాడి లుక్ లో డీసెంట్ గానే కనిపించాడు తప్ప.. ఊర మాస్ పాత్రలు ట్రై చెయ్యలేదు. అందుకే అట్టర్ ప్లాప్ దర్శకుడు మాస్ కథ తో మాస్ కేరెక్టర్ గురించి చెప్పగానే రామ్ పూరి జగన్నాధ్ కి కనెక్ట్ అయ్యాడు. వరస చిత్రాల ప్లాప్స్ తో అలలాడుతున్న పూరి కి రామ్ ఓ తురుపు ముక్కలా తగిలాడు. పూరి ప్లాప్స్ వలన, రామ్ కున్న మార్కెట్ వలన నిర్మాతలు రామ్ సినిమాని నిర్మించడానికి వెనక్కి తగ్గినా కథ మీద నమ్మకంతో పూరి.. ఛార్మి తో కలిసి రామ్ హ్యాండ్ తో ఈ ఇస్మార్ట్ శంకర్ అనే మాస్ ఎంటర్టైన్మెంట్ ని మలిచాడు. ఇక పూరి జగన్నాధ్ గత చిత్రాల ట్రాక్ రికార్డ్ ఎలా వున్నా.. ఈ ఇస్మార్ట్ శంకర్ కి రామ్ క్రేజ్ తో మొదటి నుండి మంచి హైప్ వచ్చింది. తెలంగాణ స్లాంగ్ తో.. ఊర మాస్ పాత్రలో రామ్ కేరెక్టర్ ని ఇస్మార్ట్ ట్రైలర్లో చూసిన ప్రేక్షకులు ఈ సినిమా మీద ప్రత్యేకమైన ఆసక్తిని కనబర్చారు. ఈ సినిమాలో రామ్ సరసన గ్లామర్ భామలు నిది అగర్వాల్, నాభ నటాషాలు అందాలు ఆరబోశారు.ఇక మంచి అంచనాల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో.. ప్లాప్స్ లో ఉన్న పూరి – రామ్ ల ఆ అంచనాలు ఈ సినిమాతో అందుకున్నారో లేదో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
ఉస్తాద్ శంకర్‌ (రామ్‌) ఓ కిరాయి రౌడీ. ఎలాంటి భయం లేని శంకర్‌ డబ్బు కోసం ఓ హత్య కూడా చేస్తాడు. అయితే ఆ హత్య తరవాత.. రామ్‌ని పోలీసులు వెంటాడడం మొదలెడతారు. హత్యకి ముందే శంకర్, చాందిని (న‌భా న‌టేష్ )తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్ తో కలిసి అండర్ గ్రౌండ్ లో వెళ్ళే క్రమంలోశంకర్ పై పోలీస్ గ్యాంగ్ ఎటాక్ చేస్తోంది. ఈ పోరులో తన ప్రాణానికి ప్రాణమైన చాందిని కోల్పోతాడు. తన ప్రేయసి చావుకి కారణమైన వాళ్ల కోసం శంకర్‌ గాలించడం మొదలెడతాడు. ఆ తర్వాత శంకర్ సిబిఐ కి దొరుకిపోతాడు. సిబిఐ గ్యాంగ్ వారు సిబిఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) మెమొరీను ఎక్కిస్తారు. అసలు అరుణ్ మెమొరీని, రామ్ తలలోకే ఎక్కించడానికి కారణం ఏమిటి ? దీనికి నిధి రీసెర్చ్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ తరవాత ఏమైంది? అనేదే మిగిలిన ఇస్మార్ట్ శంకర్ కథ.

నటీనటుల నటన:
ఎన్నడూ లేని విధంగా రామ్ ఈ ఇస్మార్ట్ శంకర్ లుక్ కోసం చాలా కష్టపడ్డాడనే చెప్పాలి. మాములుగా పూరి తన సినిమాలలో.. సరికొత్త మేకోవర్ లో హీరోను చూపించడం అనేది కామన్ పాయింట్. ఈ సినిమాలోనూ శంకర్ పాత్ర కోసం రామ్ ని టోటల్ గా మేకోవర్ చేసాడు. శంకర్ పాత్రకి తగ్గట్టుగా పక్కా హైదరాబాదీ యువకునిగా రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లోకి రామ్ మారిపోయాడు. ఇక తెలంగాణా యాసలో ఎనర్జిటిక్ పెరఫార్మెన్సు తో రామ్ వన్ మేన్ షో చేసాడని చెప్పాలి. రామ్ డైలాగ్ డెలివరీ, మరియు ఫుల్ ఎనర్జీ సాగే రామ్ యాక్టింగ్ అండ్ స్టెప్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. గత సినిమాల్లో కంటే.. ఈ సినిమాలో రామ్ నటన చాల కొత్తగా ఉంటుంది. మెయిన్ గా సినిమాలో అక్కడక్కడా నవ్విస్తూనే… ఇటు హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక రామ్ సరసన హీరోయిన్స్ గా నటించిన హీరోయిన్స్ నభా నటేష్ అండ్ నిధి అగర్వాల్ తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో మరియు తన గ్లామర్ తో బాగా అలరించారు. ఇద్దరు హీరోయిన్స్ పాటల్లో అందాలు ఆరబోత విషయంలో పోటీ పడ్డారనే చెప్పాలి. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో మరియు కొన్ని ప్రేమ సన్నివేశాల్లో రామ్ – నభా మధ్య కెమిస్ట్రీ బాగా అలరిస్తుంది. సత్యదేవ్ కు ఇచ్చిన ఓ కీలక పాత్రకు అతను పూర్తి న్యాయం చేసాడు. సినిమాలో మరో సహాయ నటుడు షియాజీ షిండే సినిమా చివరి వరకు సపోర్టింగ్ రోల్ లో మెప్పించాడు. మిగిలిన నటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
అట్టర్ ప్లాప్ దర్శకుడు నుండి సినిమా వస్తుంది అంటే అటు మార్కెట్ లోను, ఇటు ప్రేక్షకుల్లోనూ అస్సలు ఆసక్తి ఉండదు. కానీ కొంతమంది హీరోలు ప్లాప్ డైరెక్టర్స్ కి తగిలారంటే.. ఆ సినిమాకి ఆటోమాటిక్ గా హైప్ వస్తుంది. ఇక్కడ పూరి జగన్నాధ్ విషయంలోనూ అదే జరిగింది. గత కొన్నాళ్లుగా హిట్ మొహం చూడని పూరి జగన్నాధ్.. యావరేజ్ హిట్స్ తో ఉన్న రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాని మొదలెట్టినప్పుడు.. అయ్యో రామ్ అనవసరంగా పూరి కి ఛాన్స్ ఇచ్చాడన్నారు. కానీ కథని, పూరి ని నమ్మి రామ్ ఈ సినిమా చేసాడు. మొదట్లో కాస్త డల్ ఉన్న ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్, ట్రైలర్ వచ్చేసరికి రూపురేఖలే మారిపోయింది. సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకుల్లో ఆసక్తి వచ్చేసింది. ఇక విశ్లేషణలోకి వెళితే… ఇస్మార్ట్ శంకర్ ని పూరి తన పాత పంధాలోనే మాస్ ఎంటెర్టైనెర్ గా తీర్చిదిద్దాడు. పూరి ఎప్పుడూ మాస్ ప్రేక్షకులను మెప్పించడంపైనే దృష్టిపెడుతుంటాడు. ఈసారి మెదళ్ల మార్పిడి అనే కొత్త కాన్సెప్ట్‌ని తీసుకున్నా.. దాన్ని కూడా మాస్ కి మెచ్చేలానే చేసాడు. ఈ సినిమాలో రామ్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానమే ఈ చిత్రానికి ప్రధాన బలం. పూరి సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, దానికి కాస్త డోసు ఎక్కువ చేసి మరీ రామ్‌ పాత్రని రాసుకున్నాడు. రామ్‌ మాటలు, చేష్టలూ మాస్‌కి నచ్చుతాయి. రామ్‌ కనిపించిన ప్రతీ సన్నివేశం మాస్‌ కోసమే డిజైన్‌ చేశారు. అయితే సినిమా మొదట్లో కాస్త ఆసక్తికరంగానే ఉన్నట్టు అనిపించినా సరైన టేకింగ్ మరియు కథనం లేనట్టుగా సినిమా చూసే ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. మధ్యలో వచ్చే ఓ ట్విస్ట్ మరియు మెదడులోని జ్ఞ్యాపకాలను మార్చడం వంటి అంశాలు కాస్త కొత్తగా అనిపించినా వాటిని సరిగ్గా ఎస్టెబిలిష్ చెయ్యడంలో పూరి విఫలం అయ్యాడనే చెప్పాలి. దీనికి తోడు సినిమాలో యూత్ కి ఎట్రాక్ట్ చేసే క్రమంలో ప్రతి సన్నివేశంలో అవసరం ఉన్నా లేకపోయినా బూతులు ఇరికించి పెట్టడం కొంత ఇబ్బందిగా అనిపిస్తోంది. పైగా సెకెండ్ హాఫ్ కొన్ని సన్నివేశాలు మరి స్లోగా సాగుతాయి. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ప్రేమలో పడే సన్నివేశాలను బాగా రాసుకున్న దర్శకుడు, సెకెండ్ హాఫ్ లో లవ్ సీన్స్ ను ఆ స్థాయిలో రాసుకోలేదు. సినిమాలో కీలక సన్నివేశాలకు సరైనా లాజిక్ ఉండడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా అసలు కనెక్ట్ కాదు. ఈ ఇస్మార్ట్ ప్రయాణంలో పూరి మాస్‌ని మెప్పించాడేమో గానీ… అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునేలా ఇస్మార్ట్‌ శంకర్‌ ని తీర్చిదిద్దలేకపోయాడనే చెప్పాలి.

సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి సంగీతమందించిన మణిశర్మ పాటలు మాస్‌కి బాగా నచ్చుతాయి. అందులో రామ్‌ వేసిన స్టెప్పులు కూడా నచ్చుతాయి. ఎప్పటిలాగే మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ లో తనదైన మార్క్‌ చూపించాడు. సినిమాటోగ్రఫర్ గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు. ఎడిటర్ సినిమాను ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో అక్కర్లేని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ఇక పూరి జగన్నాధ్, ఛార్మి పెట్టిన ఖర్చు తెర మీద కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్: రామ్ ఎనర్జిటిక్ నటన, హీరోయిన్స్ గ్లామర్, సినిమాటోగ్రఫీ, మణిశర్మ నేపధ్య సంగీతం, డైలాగ్స్
నెగెటివ్ పాయింట్స్: లాజిక్ లేకపోవడం, కథనం, ఎడిటింగ్, సెకండ్ హాఫ్, బూతులు

రేటింగ్: 2.5/5

Tags:    

Similar News