Vettaiyan Movie Review: రజనీకాంత్ వేట్టయన్ సినిమా ఎలా ఉందంటే?

రజనీకాంత్ వేట్టయన్ సినిమా

Update: 2024-10-10 17:16 GMT

VettaiyanMovie

కథ: ఎస్పీ అతియాన్ (రజినీకాంత్) ఎన్‌కౌంటర్ల ద్వారా న్యాయం చేయడమే కరెక్ట్ అని నమ్మే సిద్ధాంతం ఉన్న వ్యక్తి. ఓ ఎన్‌కౌంటర్‌లో అనుకోకుండా ఒక అమాయకుడిని చంపినట్లు తెలుసుకున్న అతియాన్.చివరికి తన తప్పును సరిదిద్దుకున్నారా లేదా? అమాయకుడిని చంపేలా చేసింది ఎవరన్నది మిగిలిన కథ.

విశ్లేషణ:
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ జీవితంలో చోటు చేసుకునే మలుపులను ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్ జ్ఞానవేల్. ఒక సెన్సేషన్ క్రైం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ నిందితులను వెంటనే చంపేయాలని డిమాండ్ చేస్తారు. అలాంటప్పుడు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ లు తీసుకునే చర్యలు ఎలాంటివన్నది చూపించారు.

చిన్న చిన్న ట్విస్ట్ లతో పాటూ రజనీమార్క్ హీరోయిజం కూడా సినిమాలో చూడొచ్చు. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ ను వాడుకున్న విధానం అందరికీ పెద్దగా నచ్చకపోవచ్చు. ఫహాద్ ఫాసిల్, రానా దగ్గుబాటి లాంటి స్టార్స్ కూడా కేవలం తలైవాతో నటించాలని ఈ సినిమాకు సైన్ చేసే ఉంటారు. వేరే ఎవరు చేసినా పెద్దగా తేడా ఉండకపోవచ్చు. మంజూ వారియర్, రితిక సింగ్ ల పాత్రలు కూడా పర్వాలేదు.

ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.కొన్ని సీన్స్ చాలా బాగా ఉంటాయి.. ఇంకొన్ని సీన్లు ఎక్కడో చూసినట్లే అనిపిస్తాయి. ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వడం కష్టమే. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్లు వస్తూనే ఉంటాయి. సీరియస్ టోన్ లో సినిమా సాగే సమయంలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయాల్సి రావడం కూడా కొన్ని కొన్ని చోట్ల సినిమాకు మైనస్ అనే చెప్పొచ్చు. సెకండాఫ్ లో కాస్త సినిమా పేస్ తగ్గిపోయినట్లు, ఇక్కడ కథ నిలిచిపోయింది కదా ఇక పెద్దగా ఏమి జరుగుతుందని కూడా అనిపించొచ్చు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని హైలైట్ చేస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ కావాలని రజనీ ఎందుకు పట్టుబట్టాడో సినిమాను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సినిమాలో అంత మంది స్టార్స్ ఉన్నా సెకండ్ హీరో అనిరుధ్ అనే చెప్పొచ్చు. సినిమాటోగ్ర‌ఫీ మాత్రం చాలా బాగుంటుంది. ఈ చిత్రం సూపర్ స్టార్ అభిమానులకు బాగా నచ్చుతుంది.

ఓవరాల్ గా ఈ పండగ హాలిడేస్ లో రజనీ సినిమాపై కూడా ఓ లుక్ వేయొచ్చు.
Tags:    

Similar News