స్వీట్ & షార్ట్ రివ్యూ : రూల‌ర్‌

టైటిల్‌: రూల‌ర్‌ బ్యాన‌ర్‌: హ‌్యాపీ మూవీస్‌ న‌టీన‌టులు: బాల‌కృష్ణ, సోనాల్ చౌహాన్‌, వేదిక‌, భూమిక‌, ప్రకాష్‌రాజ్‌, జ‌య‌సుధ త‌దిత‌రులు క‌థ‌, మాట‌లు: ప‌రుచూరి ముర‌ళీ సినిమాటోగ్ర‌ఫీ: సీ.రాంప్రసాద్‌ [more]

Update: 2019-12-20 04:50 GMT

టైటిల్‌: రూల‌ర్‌
బ్యాన‌ర్‌: హ‌్యాపీ మూవీస్‌
న‌టీన‌టులు: బాల‌కృష్ణ, సోనాల్ చౌహాన్‌, వేదిక‌, భూమిక‌, ప్రకాష్‌రాజ్‌, జ‌య‌సుధ త‌దిత‌రులు
క‌థ‌, మాట‌లు: ప‌రుచూరి ముర‌ళీ
సినిమాటోగ్ర‌ఫీ: సీ.రాంప్రసాద్‌
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మణ్‌, అన్బార్వ్‌
మ్యూజిక్‌: చిరంత‌న్ భ‌ట్‌
ఆర్ట్‌: చిన్నా
నిర్మాత‌: సీ క‌ళ్యాణ్‌
ద‌ర్శ‌క‌త్వం: కేఎస్‌.ర‌వికుమార్‌
ర‌న్ టైం: 150 నిమిషాలు
సెన్సార్ రిప‌ర్ట్‌: యూ / ఏ
రిలీజ్ డేట్‌: 20 న‌వంబ‌ర్‌, 2019

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో 105వ సినిమాగా తెర‌కెక్కింది రూల‌ర్‌. శాత‌క‌ర్ణి త‌ర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వెయిట్ చేస్తోన్న బాల‌య్య‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు సినిమాలు పీడ‌క‌ల‌ను మిగిల్చాయి. ఈ రెండు సినిమాల త‌ర్వాత బాల‌య్య న‌టిస్తోన్న రూల‌ర్‌పై బాల‌య్యతో పాటు ఆయ‌న అభిమానులు చాలా ఆశ‌లే పెట్టుకున్నారు. ట్రైల‌ర్లు, టీజ‌ర్లతో మాత్రం రొటీన్ సినిమాగానే ఉంటుంద‌న్న అంచ‌నాలు ఏర్పడ్డాయి. గ‌తంలో ఇదే డైరెక్టర్‌తో బాల‌య్య చేసిన జై సింహా సంక్రాంతికి వ‌చ్చి ఓ మోస్తరుగా ఆడ‌డంతో రూల‌ర్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుంద‌ని ఫ్యాన్స్ ఆశ‌ల‌తో ఉన్నారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన రూల‌ర్‌తో బాల‌య్య రూల్ చేశాడా ? లేదా ? అన్నది స‌మీక్షలో చూద్దాం.

స్టోరీ:

యూపీలో తెలుగు రైతులు 2 వేల ఎక‌రాల భూమిలో వ్యవ‌సాయం చేసుకునేందుకు యూపీ ప్రభుత్వం అనుమ‌తిస్తుంది. ఠాగూర్ వంశానికి చెందిన భ‌వానీ ఠాగూర్ అక్కడ రెవెన్యూ మంత్రిగా ఉంటాడు. అన్న ప్రకాష్‌రాజ్ కుమార్తె భూమిక త‌క్కువ కులానికి చెందిన వాడిని పెళ్లాడుతుంది. భూమిక భ‌ర్తను చంపేసిన మంత్రి భ‌వానీ అన్న, అన్న కుమార్తెను చంపాల‌నుకుంటాడు. వాళ్లకు అక్కడ తెలుగు రైతులు అండ‌గా ఉంటారు. ఆ తెలుగు రైతులు సాగు చేసుకుంటోన్న భూముల జీవోను ర‌ద్దు చేయిస్తాడు మంత్రి. ఈ క్రమంలోనే తెలుగు రైతుల కుటుంబానికి చెందిన పోలీస్ ఆఫీస‌ర్ ధ‌ర్మ (బాల‌య్య) మంత్రికి ఎదురొడ్డి నిలుస్తాడు ? ఈ క్రమంలోనే చివ‌ర‌కు క‌థకు హైద‌రాబాద్‌లోని ఏషియ‌న్ సాఫ్ట్‌వేర్ అధినేత అర్జున ప్రసాద్ (బాల‌య్యకు) లింక్ ఏంటి ? ఈ క‌థ‌లో హీరోయిన్లు సోనాల్ చౌహాన్‌, వేదిక రోల్ ఏంటి ? చివ‌ర‌కు యూపీలో తెలుగు రైతుల‌కు న్యాయం జ‌రిగిందా ? ధ‌ర్మ, అర్జున్ ప్రసాద్ ఒక్క‌రేనా ? వేర్వేరా ? అన్న ప్రశ్నల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా.

విశ్లేష‌ణ‌:

ద‌ర్శకుడు కేఎస్‌.ర‌వికుమార్ ఎప్పుడో బీసీ కాలం నాటి క‌థ‌ను తీసుకుని.. దానికి యూపీ బ్యాక్ డ్రాప్ జోడించి త‌న పాత సినిమాల‌తో పాటు బాల‌య్య పాత సినిమాల్లో సీన్ల‌ను మిక్స్ చేసి ర‌సం తీసి ఈ సినిమా తీసేశాడు. క‌థ‌, క‌థ‌నాలు ఎంత మాత్రం ఆక‌ట్టుకోలేదు. ఉన్నంత‌లో బాల‌య్య ఎన‌ర్జీతో చెప్పే డైలాగులు, పాట‌ల‌కు వేసిన స్టెప్పులు బాగున్నాయి. చివ‌ర‌కు బాల‌య్య ధ‌ర్మా క్యారెక్టర్ విగ్గు కూడా సెట్ కాలేదంటే ద‌ర్శకుడు ఏ మాత్రం కాన్‌సంట్రేష‌న్ చేశాడో అర్థమ‌వుతోంది. సినిమాలో బాల‌య్య ఎన‌ర్జీని వ‌దిలేస్తే చెప్పుకునేందుకు ఏ ఒక్క హైలెట్ కూడా లేదు. హీరోయిన్లు అందంగా క‌నిపించారు. సోనాల్ బికినీ ట్రీట్ బాగుంది. చివ‌ర‌కు బాల‌య్య అభిమానుల్లో కూడా ఈ సినిమా అంద‌రికి న‌చ్చుతుందా ? అన్న‌ది డౌటే.

ఫైన‌ల్‌గా….బాల‌య్య మార్క్ ప‌ర‌మ రొటీన్ ఊర మాస్ రూల‌ర్‌

Tags:    

Similar News