తెనాలి రామకృష్ణ బిఎ బిల్ మూవీ రివ్యూ
బ్యానర్: SNS క్రియేషన్స్ నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్, సప్తగిరి, వెన్నెలకిషోర్, మురళి శర్మ, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శీను తదితరులు మ్యూజిక్ [more]
బ్యానర్: SNS క్రియేషన్స్ నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్, సప్తగిరి, వెన్నెలకిషోర్, మురళి శర్మ, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శీను తదితరులు మ్యూజిక్ [more]
బ్యానర్: SNS క్రియేషన్స్
నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్, సప్తగిరి, వెన్నెలకిషోర్, మురళి శర్మ, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శీను తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: సాయి కార్తీక్
ఎడిటర్: చోట కె ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ప్రొడ్యూసర్: సంజీవ్ రెడ్డి
డైరెక్టర్: నాగేశ్వర రెడ్డి
ప్రస్థానం లో శర్వానంద్ తమ్ముడి గా కేరెక్టర్ ఆర్టిస్ట్ గా ఇరగదీసిన సందీప్ కిషన్ మొదట్లో వేంకటాద్రి ఎక్సప్రెస్ లాంటి సినిమాల్తో హీరోగా ఆకట్టుకున్నాడు. కానీ మధ్యలో సందీప్ కిషన్ రాంగ్ స్టెప్స్ వేసి పూర్తిస్థాయి ప్లాప్ హీరోగా మిగిలిపోయాడు. సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. హిట్ అనేది తగలడం లేదు. తెలుగులోనే కాదు తమిళంలోనూ సందీప్ కిషన్ కి కలిసి రాలేదు. యంగ్ హీరోల్లో సందీప్ ఒక హీరోగా హిట్స్ కొట్టి నిలబడతాడనుకుంటే…. అర్ధం పర్ధం లేని కథలతో సినిమాలు చేస్తూ హీరో గా ఇమేజ్ మొత్తం పోగొట్టుకున్నాడు. కథ ఎంపికలో చేసిన పొరపాట్లు ఈ యంగ్ హీరో కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే తప్పటడుగుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న సందీప్ ఇప్పుడు కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.మధ్యలో నిర్మాతగా మారి నిను వీడని నీడని లాంటి సస్పెన్సు థ్రిల్లర్ సినిమా చేసిన సందీప్ కి ఆ సినిమా కాస్త ఊరటనిచ్చింది. అయితే ఆ సినిమా కాస్త ఆడడంతో.. మళ్ళీ ఊపులోకొచ్చిన సందీప్ కిషన్ ప్లాప్ హీరోయిన్ హన్సికతో కలిసి ప్లాప్ డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ అంటూ ఓ సినిమా చేసాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండానే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్లాప్ సినిమాల్తో మార్కెట్ పడిపోయిన సందీప్ కిషన్ కి తెనాలి రామకృష్ణ ఏమైనా హెల్ప్ చేసిందా… లేదా.. అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
తెనాలి రామకృష్ణ (సందీప్‌కిషన్) ఓ కుర్ర లాయరు. నాకో కేసు ఇప్పించండి ప్లీజ్ అంటూ బోర్డులు పెట్టుకుని మరీ క్లయింట్లని ఆహ్వానిస్తుంటాడు. కోర్టులో ఉన్న పెండింగ్ సివిల్ కేసులను బయట తన తెలివి తేటలతో కాంప్రమైజ్ చేసే కేసులు లేని కుర్ర లాయర్ తెనాలి రామకృష్ణ అత్యంత క్లిస్టమైన వరలక్ష్మీ (వరలక్ష్మీ శరత్ కుమార్) కేసులో ఇన్వాల్వ్ అవుతాడు. కర్నూలు ప్రాంతంలో రాజకీయంగా ఎదగాలనుకున్న సింహాద్రి నాయుడు(అయ్యప్ప శర్మ) తనకు అడ్డుగా ఉన్న వరలక్ష్మీ దేవిని ఓ జర్నలిస్ట్ మర్డర్ కేసులో పోలీసుల సాయంతో దొంగ సాక్ష్యాలు పుట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి వరలక్ష్మీ కేసును తెనాలి రామకృష్ణ ఎలా డీల్ చేశారు? అసలు జర్నలిస్ట్ ని చంపింది ఎవరు? ఈ కేసులో అసలు నేరస్థులకు తెనాలి రామకృష్ణ శిక్ష పడేలా చేశాడా? అనేది మిగతా కథ.
నటీనటుల పెరఫార్మెన్స్:
సందీప్ కిషన్ కోర్ట్ తీర్పుల కంటే బయట కాంప్రమైజ్ బెటర్ అని నమ్మే కుర్ర లాయర్ తెనాలి రామకృష్ణ పాత్ర చక్కగా చేశాడు. కామెడీ టైమింగ్ తనకు ఏమాత్రం సూటవ్వలేదు. కామెడీ చెయ్యడానికి చాలా కష్టపడ్డాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్‌కి ముందు సందీప్ చాలా వరకు కనిపించడు. ఇక ఫెడవుట్ హీరోయిన్ హన్సికని హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. హన్సిక మొహమంతా క్యారీ బ్యాగులే కనిపించాయి. మేకప్ ఎక్కువ.. అందం తక్కువ అన్నట్టుగా ఉంది. హన్సిక నవ్వితే అస్సలు చూడలేకపోయాం.కేవలం గ్లామర్ షోకు మాత్రమే పనికొచ్చింది. ఇక తమిళ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. ఆమెకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారో సినిమా అయ్యే వరకు అర్ధం కాదు. పోసాని, ప్రభాస్ శీను, వెన్నెల కిషోర్ కామెడీ వెగటు పుట్టించేలా ఉంది.
విశ్లేషణ:
ఒకప్పుడు జి నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు అంటే సినిమాలో కామెడీ ఉంటుంది కాస్త నవ్వుకోవచ్చు అని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. కానీ ఈమధ్యన జి నాగేశ్వర్ రెడ్డి సినిమాల్లో అతి కామెడీ వెగటు పుట్టిస్తుంది. మరి ప్లాప్ హీరో సందీప్ కిషన్ కి ఏ దిక్కు లేక నాగేశ్వర్ రెడ్డి దర్శకుడిగా దొరికాడనిపిస్తుంది. నాగేశ్వర్ రెడ్డి – సందీప్ కిషన్ కాంబోలో తెరకెక్కిన తెనాలి రామకృష్ణ మూవీ పూర్తి స్థాయి కామెడీ సినిమా అని ప్రచారం జరిగింది. ఫస్ట్ హాఫ్ చక్కని కామెడీ, సందీప్ పాత్రకు తగ్గట్టుగా ఎలివేషన్ సీన్స్ తో పాటు హీరోయిన్ తో నడిచే కెమిస్ట్రీ, సాంగ్స్…, ఇలా సినిమా చాలా ఆసక్తికరంగా సాగింది. సినిమాను ఇంట్రస్టింగ్‌గా మొదలు పెట్టిన దర్శకుడు, ఫస్ట్ హాఫ్‌లో అంతా హీరో హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్‌తోనే సరిపెట్టేశాడు. అక్కడక్కడా కామెడీ, కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్క్ అవుట్ అయినా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే స్థాయిలో అయితే లేవు. అసలే నెమ్మదిగా సాగుతున్న కథనాన్ని పాటలు మరింత ఇబ్బంది కరంగా మార్చాయి. పాటలు కావాలని ఇరికించినట్టుగా అనిపిస్తాయి. తనదైన శైలిలో కామెడీ పంచ్‌లు సన్నివేశాలు అల్లుకోవడంలో బాగనే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి తనదైన కామెడీని పక్కనపెట్టి.. సినిమాను పూర్తిగా సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్లాడు. హీరో, విలన్ మధ్య ఎత్తు పై ఎత్తులతో ఇంట్రస్టింగ్‌గా నడిపించే అవకాశం ఉన్నా కామెడీకే ఇంపార్టెన్స్ ఇస్తూ.. ఏ మాత్రం లాజిక్ లేని సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. ద్వితీయార్థంలో కామెడీ మాత్రం అక్కడక్కడా ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు కూడా సాదాసీదాగా సాగటంతో తెనాలి రామకృష్ణ ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తాడు.
సాంకేతికంగా…
సాయి కార్తీక్ మ్యూజిక్ అందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్స్‌లో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్: 1.75/5