ఐసీయూలో ప్రాణాలు నిలబడతాయనుకుంటే.. ఇలాంటి విషాదమా!!

ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 54 మంది ఉన్నారని

Update: 2024-11-16 03:38 GMT

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ఓ ఆసుపత్రిలో గత రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మరణించగా, 16 మంది పిల్లలు ప్రాణాలతో పోరాడుతున్నారు. మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)లో రాత్రి 10:45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ కుమార్ తెలిపారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు ధృవీకరించారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 54 మంది ఉన్నారని 44 మంది నవజాత శిశువులను రక్షించామని అధికారులు తెలిపారు. 10 మంది బాధితుల్లో ఏడుగురిని గుర్తించామని, మిగిలిన ముగ్గురిని గుర్తించేందుకు అవసరమైతే DNA పరీక్షలు నిర్వహిస్తామని ఒక అధికారి తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.
గాయపడిన 16 మంది చిన్నారులు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) ఝాన్సీ సుధా సింగ్ తెలిపారు. వారికి తగిన వైద్య సదుపాయాలను అందిస్తూ ఉన్నారని తెలిపారు. ఆసుపత్రిలో ఫైర్ అలారంలు పనిచేయడం లేదని, అత్యవసర వ్యవస్థల నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.


Tags:    

Similar News