కలవరపెడుతోన్న కొత్త వేరియంట్లు.. తెరపైకి మరో రెండు వేరియంట్లు..

బీఏ 4, బీఏ5 వేరియంట్లు కూడా బీఏ2 వేరియంట్ లాగే స్పైక్ ప్రొఫైల్ ను కలిగి ఉన్నాయని దక్షిణాఫ్రికా పరిశోధకులు తెలిపారు.

Update: 2022-04-13 06:33 GMT

ప్రపంచాన్నంతటినీ రెండేళ్లుగా వణికిస్తోన్న కరోనా ఇప్పుడప్పుడే అంతమయ్యేలా కనిపించడం లేదు. కరోనా తర్వాత దానికి సంబంధించిన డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు వేరియంట్లు తెరపైకొచ్చాయి. దక్షిణాఫ్రికాలో బీఏ 4, బీఏ 5, వేరియంట్లను పరిశోధకులు గుర్తించారు. ఈ వేరియంట్లకు సంబంధించి పదుల సంఖ్యలో కేసులను దక్షిణాఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లోనూ గుర్తించారు.

బీఏ 4, బీఏ5 వేరియంట్లు కూడా బీఏ2 వేరియంట్ లాగే స్పైక్ ప్రొఫైల్ ను కలిగి ఉన్నాయని దక్షిణాఫ్రికా పరిశోధకులు తెలిపారు. ఈ వేరియంట్లు బోట్స్‌వానా, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్‌తో, బ్రిటన్‌లోనూ వ్యాప్తి చెందాయ‌ని వివ‌రించారు. అయితే ఈ వేయంట్లపై అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ కేసుల్లో ఆస్పత్రుల్లో చేరడం, మృతి చెందడం వంటివి లేవని నిపుణులు చెప్తున్నారు. అయితే బీఏ4, బీఏ5 వేరియంట్లు సోకిన బాధితులంతా ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నవారేనని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.




Tags:    

Similar News