RRB-NTPC ఫలితాల నిరసనలు : విద్యార్థులను కొట్టిన పోలీసులు సస్పెండ్
నలంద, నవాడ, సీతామర్హి, బక్సర్, అర్రా, ముజఫర్‌పూర్‌లలో అభ్యర్థులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. రెండు, మూడ్రోజులుగా
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) పరీక్ష 2021 ఫలితాలు జనవరి 15వ తేదీన విడుదలయ్యాయి. ఫలితాలు చూసిన అభ్యర్థులు.. భారీగా అవకతవకలు జరిగాయంటూ ఆందోళనలు చేపట్టారు. ఫలితాలపై దేశ వ్యాప్తంగా అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. ఫలితాలకు వ్యతిరేకంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. అభ్యర్థులను కట్టడిచేయటానికి పోలీసులు లాఠీచార్జీలు, టియర్‌గ్యాస్‌లను ప్రయోగించారు.
నలంద, నవాడ, సీతామర్హి, బక్సర్, అర్రా, ముజఫర్‌పూర్‌లలో అభ్యర్థులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. రెండు, మూడ్రోజులుగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రైళ్లను ధ్వంసం చేయడంతో పాటు.. రైళ్లపైకి రాళ్లు రువ్వుతున్నారు. తాజాగా బీహార్ లోని గయా జంక్షన్ లో భభువా - పట్నా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ని తగలబెట్టారు అభ్యర్థులు. ఈ ఘటనలో రైలులోని పలు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇదిలా ఉండగా.. రైల్వే పరీక్ష ఫలితాలకు సంబంధించి ప్రయాగ్ రాజ్ లోనూ ఆందోళన జరగ్గా.. ఆ సమయంలో విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు అధికారులు.
Also Read : కనుమరుగు కానున్న కడప.. ఇక చరిత్రకే పరిమితమా !
ఈ ఘటనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఎస్‌ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విద్యార్థులను ప్రేరేపించినందుకు ఖాన్ సర్‌తో సహా పాట్నాలోని చాలా కోచింగ్ సెంటర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు పోలీసు సిబ్బందిలో ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరంతా అనవసరంగా విద్యార్ధులను కొట్టారని ఆరోపిస్తున్నారు.