నదీ గర్భంలో మెట్రో రైలు.. మన దగ్గరే
కోల్‌కత్తాలో నదీ గర్భంలో మెట్రో రైలు వెళ్లేలా మార్గాన్ని ఏర్పరిచారు. ట్రయల్ రన్ ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు
కోల్‌కత్తాలో నదీ గర్భంలో మెట్రో రైలు వెళ్లేలా మార్గాన్ని ఏర్పరిచారు. దీని ట్రయల్ రన్ ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. కోల్‌కత్తాలోని హుబ్లీ నదిలో ఈ మెట్రో రైలు దేశంలోనే మొట్టమదటిది అని చెబుతున్నారు. దాదాపు 33 మీటర్ల లోపు దీనిని నిర్మించారు. 1984లోనే కోల్‌కత్తా మెట్రో రైలు ప్రారంభమయింది. అయితే మహాకరణ్ స్టేషన్నుంచి హౌరా మైదాన్ స్టేషన్ వరకూ ఈమెట్రో రైలు హుబ్లీ నదిలో వెళ్లేలా నిర్మించారు.
సొరంగ మార్గం ద్వారా...
పూర్తిగా సొరంగ మార్గం ద్వారా ఈ రైలు ప్రయాణం చేయనుంది. ప్రయాణికులకు సరికొత్త అనుభూతి నిస్తుంది. నదీగర్భంలో దేశంలో తొలిసారి ఈ రైలును ప్రవేశపెడుతున్నట్లు కోల్‌కత్తా మెట్రోరైలు అధికారులు చెబుతున్నారు. ట్రయల్ రన్ దాదాపు ఏడు నెలల పాటు సాగనుందని తెలిపారు. ట్రయల్ రన్ తర్వాత ప్రయాణం సురక్షితమని తేలిన తర్వాతనే ప్రయాణికులకు రైలులోకి అనుమతిస్తారని మెట్రో రైలు అధికారులు తెలిపారు.