ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీని ఆమ్ ఆద్మీపార్టీ శాసనసభ పక్ష సమావేశం ఎన్నుకున్నట్లు తెలిసింది
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీని ఆమ్ ఆద్మీపార్టీ శాసనసభ పక్ష సమావేశం ఎన్నుకున్నట్లు తెలిసింది. గత రెండు రోజులగా కొత్త ముఖ్యమంత్రిగా ఢిల్లీకి ఎవరు బాధ్యతలను చేపడతారనడానికి తెరపడినట్లయింది. అతిశి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఉన్నత చదువులు చదవి కేజ్రీవాల్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన అతిశీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.
జైలుకు వెళ్లిన సమయంలో...
కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన సమయంలో కూడా అతిశీ పాలనపరమైన విషయాలను దగ్గరుండి పర్యవేక్షించారు. కేజ్రీవాల్ కు నమ్మకమైన నేతగా ఆమె గుర్తింపు పొందారు. అందుకే అతిశిని ఎన్నుకోవడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. శాసనసభ సభ పక్ష సమావేశంలో అతిశీ పేరును ఏకగ్రీవంగా అందరూ ఆమోదించినట్లు తెలిసింది. ఈరోజు సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ను కలసి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు.