రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహమిదే

బీజేపీయేతర పార్టీలతో సంప్రదించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని ఖారారు చేయాలని నిర్ణయించింది.

Update: 2022-06-11 06:59 GMT

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపేందుకు కసరత్తులు చేస్తుంది. బీజేపీయేతర పార్టీలతో సంప్రదించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని ఖారారు చేయాలని నిర్ణయించింది. బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే అంత బలం లేదు. 1.2 శాతం ఓట్లు అవసరం. అందుకే అన్ని పార్టీలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అన్ని పార్టీలను కలసి అభ్యర్థి ఎంపికపై చర్చించే బాధ్యతను సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు.

అన్ని పార్టీలూ...
అన్ని పార్టీలూ అంగీకరించిన అభ్యర్థిని పోటీకి దింపాలని, కాంగ్రెస్ తనంతట తాను అభ్యర్థిగా ప్రకటించదని ఏఐసీసీ నేత ఒకరు చెప్పారు. కాంగ్రెస్ అనుకూల పార్టీల నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఇప్పటికే మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు. ఆయన రేపు ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీని కలిసే అవకాశాలున్నాయి. అలాగే డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీల అభిప్రాయాలను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తుంది.


Tags:    

Similar News