Delhi : ఢిల్లీలో దీపావళి తర్వాత వాయుకాలుష్యం ఎలా ఉందంటే?
ఢిల్లీలో వాయు కాలుష్యం దీపావళి తర్వాత మరింత ఎక్కువయింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం దీపావళి తర్వాత మరింత ఎక్కువయింది. ప్రజలు ఈ వాయుకాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీపావళికి బాణాసంచా కాల్చడంతో వాయు కాలుష్యం మరింత పెరిగిందని చెబుతున్నారు. మామూలుగానే పంజాబ్, హర్యానాలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తగలపెడుతుండటంతో ఇటీవల కాలంలో వాయు కాలుష్యం పెరిగింది. కానీ దీపావళి తర్వాత మరింత పెరిగింది
మరింత పెరగడంతో...
ఈరోజు ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 700 కంటే ఎక్కువ నమోదయిందని చెబుతున్నారు. దీంతో ఢిల్లీ వాసులు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. బయటకు వచ్చి గాలి పీల్చుకుంటే రోగాల బారిన పడుతున్నారు. ఎక్కువగా ఆనంద్ విహార్ ప్రాంతలో ఎక్కువ వాయు కాలుష్యం ఉందని లెక్కలు చెబుతున్నాయి. తర్వాత డిఫెన్స్ కాలనీలోనూ వాయు కాలుష్యం ఎక్కువగానే ఉంది. ఎక్కువ మంది ఈ కాలుష్యం బారిన పడి వ్యాధులకు లోనవుతున్నారు.