Delhi : ఒక్కసారిగా పెరిగిన ఢిల్లీలో వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గలేదు. గాలి నాణ్యత మరింత అద్వాన్నంగా మారింది
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గలేదు. గాలి నాణ్యత మరింత అద్వాన్నంగా మారింది. ఈరోజు అనేక చోట్ల ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ 400గా నమోదయింది. దీంతో ఢిల్లీ ప్రజలు గాలి పీల్చడానికే భయపడుతునర్నారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నాలుగు వందల కంటే ఎక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ నమోదు కావడంతో ప్రజల్లో ఆందోలన వ్యక్తమవుతుంది. హర్యానా, పంజాబ్ లలో పంటలను తగులుపెడుతున్న నేపథ్యంలో గాలిలో నాణ్యత మరింత క్షీణించింది.
శ్వాస కోశ వ్యాధులతో...
దీపావళి పండగ తర్వాత వాయు కాలుష్యం మరింతగా ఢిల్లీలో పెరిగింది. ప్రజలు మాస్క్‌లు ధరించి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక మంది వాయుకాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. చాలా మంది శ్వాస కోశ వ్యాధులతో ఆసుపత్రలకు వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీలయినంత వరకూ ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు వచ్చినా మాస్క్ లు ధరించాలని సూచిస్తున్నారు.