నేడు పార్లమెంట్ హౌస్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
నేడు పార్లమెంట్ హౌస్ లోని ప్రేరణ స్థల్ వద్ద అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.;

నేడు పార్లమెంట్ హౌస్ లోని ప్రేరణ స్థల్ వద్ద అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగీప్ ధనఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు బాబాసాహెబ్ కు పుష్పాంజలి ఘటించనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు హౌస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారీ భద్రత...
పార్లమెంటు హౌస్ కు అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా అధిక సంఖ్యలో రానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయనకు నివాళులర్పించనున్నారు నేతలు. అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళతామని చెప్పనున్నారు.