భారత్ లో యాపిల్ ప్లాంట్ మూసివేత ?

ఫాక్స్ కాన్ లో జరిగిన ఆ ఘటనలో కంపెనీలో పనిచేసే 150 మంది కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. దాంతో కార్మికులకు మద్దతుగా ఉద్యోగులంతా

Update: 2021-12-22 03:51 GMT

ప్రపంచ టెక్ దిగ్గజమైన యాపిల్ కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. కాస్త రేటెక్కువైనా సరే.. దాని స్పెషలే వేరే లెవల్లో ఉంటుంది. భారత్ లో ఆపిల్ ఫోన్లను తయారు చేసే ప్లాంట్ ను కంపెనీ మూసివేయనుంది. ఇక్కడ ఫాక్స్ కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లను తయారు చేస్తోంది. ఇటీవలే ప్లాంట్ లో ఫుడ్ పాయిజన్ ఘటన జరగగా.. అప్పట్నుంచీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ ను 5 రోజుల పాటు మూసివేయనున్నట్లు కాంచీపురం పోలీసులు వెల్లడించారు. కాగా.. ఇప్పటివరకూ ఈ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఫాక్స్ కాన్ గానీ.. యాపిల్ గానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.. స్పందించలేదు.

ఫాక్స్ కాన్ లో జరిగిన ఆ ఘటనలో కంపెనీలో పనిచేసే 150 మంది కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. దాంతో కార్మికులకు మద్దతుగా ఉద్యోగులంతా నిరసనకు దిగి చెన్నై - బెంగళూరు హైవేను దిగ్భంధించారు. పోలీసులు రంగంలోకి దిగి నిరసన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగులు మరింత ఆందోళన చేయడంతో.. ప్లాంట్ ను 5 రోజుల పాటు.. అంటే ఆదివారం వరకూ మూసివేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.



Tags:    

Similar News