Petrol : వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్... నేటి నుంచే...పెట్రోలుపై ఇంత తగ్గింపా?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించింది
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఊరట నిచ్చే వార్త చెప్పింది. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ లీటర్ కు రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈరోజు నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఎంతో ఊరట కల్గించే అంశంగా చెప్పాలి.
కొన్నేళ్లుగా పెరుగుతున్న...
గత కొన్నేళ్లుగా పెట్రోలు, ధరలు పెరిగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణంగా చమురుసంస్థలు ప్రతి నెల ఒకటో తేదీన పెట్రో ఉత్పత్తుల ధరను సమీక్షిస్తాయి. కానీ ఎప్పుడూ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించలేదు. ఇటీవల గ్యాస్ సిలిండర్ పై వంద రూపాయలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలపై కూడా రెండు రూపాయలు లీటరుకు తగ్గించి చాలా వరకూ భారం తగ్గిందనే చెప్పాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.