జులై నెలలో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులు

ఈ మేరకు ఆర్బీఐ జులై మంత్ బ్యాంక్స్ హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. ఏయే ప్రాంతాల్లో బ్యాంకులు సెలవులుంటాయో

Update: 2023-06-30 01:00 GMT

july 2023 banks holiday

నేటితో జూన్ నెల ముగుస్తుంది. రేపటి నుంచి జులై నెల ప్రారంభం. జూన్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉంటే.. జులైలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ జులై మంత్ బ్యాంక్స్ హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. ఏయే ప్రాంతాల్లో బ్యాంకులు సెలవులుంటాయో గ్రహించి.. కస్టమర్లు బ్యాంకుల్లో లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం మంచిది. జులైలో బ్యాంకుల సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.

జులై 2 : ఆదివారం
జులై 5 : గురు హర్గోబింద్​ సింగ్​ జయంతి సందర్భంగా జమ్ము- శ్రీనగర్​లోని బ్యాంక్​లకు సెలవు.
జులై 6 : ఎంహెచ్​ఐపీ డే సందర్భంగా మిజోరంలో బ్యాంక్ ​లకు సెలవు.
జులై 8 : రెండో శనివారం.. అన్ని బ్యాంకులకు సాధారణ సెలవు.
జులై 9 : ఆదివారం
జులై 11 : కేర్​ పూజ సందర్భంగా త్రిపురలోని బ్యాంక్​లకు హాలీడే.
జులై 13 : భాను జయంతి సందర్భంగా సిక్కింలోని బ్యాంక్​లకు సెలవు.
జులై 16 : ఆదివారం.
జులై 17 : యూ టిరోట్​ సింగ్​ డే సందర్భంగా మేఘాలయలోని బ్యాంక్​లకు హాలీడే.
జులై 22 : నాలుగో శనివారం బ్యాంకులకు సాధారణ సెలవు.
జులై 23 : ఆదివారం.
జులై 29 : మొహర్రం పండుగ సందర్భంగా దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాల్లోని బ్యాంక్​లకు సెలవు ఉంటుంది.
జులై 30 : ఆదివారం
జులై 31 : మార్టీడం డే సందర్భంగా హరియాణా, పంజాబ్​లోని బ్యాంక్​లకు సెలవు.
నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు సాధారణమైన సెలవులు ఉంటే.. మిగతా రోజుల్లో వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండుగలు, స్పెషల్ రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. జులై నెలలో ఐదు ఆదివారాలు, ఐదు శనివారాలు వచ్చినా.. జులై నెలలో రెండు శనివారాలే బ్యాంకులు పనిచేస్తాయి. ఐదవ శనివారం మొహర్రం కావడంతో బ్యాంకులకు హాలిడే.


Tags:    

Similar News