నవంబర్ నెలలో బ్యాంకులకు 10 రోజులు సెలవులు

గురునానక్‌ జయంతి, వంగ్లా ఫెస్టివల్‌, కన్నడ రాజ్యోత్సవ్‌, కుట్‌ ఫెస్టివల్‌, సెంగ్‌ కుట్‌సనేం వంటి పండుగలకు సెలవులు..

Update: 2022-10-29 13:53 GMT

bank holidays in november 2022

November bank holidays : రెండ్రోజుల్లో నవంబర్ నెల ఆరంభం కానుంది. మంగళవారం నుంచి మొదలయ్యే నవంబరు నెలలో బ్యాంకులు 10 రోజులు మూతపడనున్నాయి. అక్టోబర్ నెలలో పండుగలు ఎక్కువగా ఉండటంతో.. బ్యాంకుల సెలవులు ఎక్కువయ్యాయి. అక్టోబర్ నెలతో పోలిస్తే.. నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు తక్కువే. నాలుగు ఆదివారాలు, రెండవ శనివారం, నాల్గవ శనివారంతో కలిపి సుమారు 10 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. నవంబర్‌ 1,8,11,23 తేదీల్లో బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది.

గురునానక్‌ జయంతి, వంగ్లా ఫెస్టివల్‌, కన్నడ రాజ్యోత్సవ్‌, కుట్‌ ఫెస్టివల్‌, సెంగ్‌ కుట్‌సనేం వంటి పండుగలకు సెలవులు ప్రకటించింది ఆర్బీఐ.నవంబర్‌ 1న కన్నడ రాజ్యోత్సవ్‌ / కుట్‌.. కర్ణాటక, మణిపూర్‌ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. నవంబర్‌ ఒకటో తేదీన కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావం జరుగగా.. ఆ రోజును రాజ్యోత్సవ్‌ గా జరుపుకుంటారు. అలాగే.. కుట్‌ ఫెస్టివల్‌ అంటే చవాంగ్‌ కుట్‌. బౌంటీఫుల్‌ హార్వెసట్‌ దీవెనల కోసం చవాంగ్‌ కుట్‌ ఉత్సవాలు నిర్వహిస్తారు. నవంబర్‌ 8న గురునానక్‌ జయంతి, కార్తీక పౌర్ణమి. ఆ రోజున త్రిపుర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, అసోం, సిక్కిం, మణిపూర్‌, కేరళ, గోవా, బీహార్‌, మేఘాలయ మినహా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 11వ తేదీన కనకదాస జయంతి/ వంగాలా ఫెస్టివల్‌ కావడంతో.. కర్ణాటక, మేఘాలయ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. నవంబర్‌ 23.. సెంగ్‌ కుట్స్‌నేమ్‌ లేదా సెంగ్‌ కుట్‌స్నేం సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు పనిచేయవు. ప్రతిఏటా ఖాసీ నూతన సంవత్సరం సందర్భంగా ఖాసీ సామాజిక వర్గం వారు నవంబర్‌ 23న ఖాసీ నూతన సంవత్సరాదిగా భావిస్తారు. దీన్నే సెంగ్‌ కుట్‌ స్నేమ్‌ అని పిలుస్తారు. నవంబర్ 6,13,20,27 తేదీలు ఆదివారాలు, 12న రెండో శనివారం, 26న నాల్గవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవులు. వినియోగదారులు బ్యాంకుల సెలవు దినాలు తెలుసుకుని.. తమ లావాదేవీల పనులు పూర్తి చేసుకోవచ్చు.


Tags:    

Similar News