బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం

బెంగాల్ లోని యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి ఛాన్సిలర్ గా వ్యవహరించేలా రూపొందించిన బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది.

Update: 2022-06-13 13:38 GMT

బెంగాల్ పరిధిలోని యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి ఛాన్సిలర్ గా వ్యవహరించేలా రూపొందించిన బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ ఛాన్సిలర్ లుగా వ్యవహరిస్తూ అనేక ఇబ్బందులు గురి చేస్తుండటంతో బెంగాల్ లోని మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు అనుకూలంగా 182 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 40 ఓట్లు వచ్చాయి. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందింది.

ప్రధానికి ఒక రూలు.. సీఎంకు..?
కేంద్రం పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలకు ప్రధానమంత్రి ఛాన్సిలర్ గా వ్యవహరిస్తుండగా, రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి ఛాన్సిలర్ గా ఎందుకు ఉండకూడదని టీఎంసీ ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం ఉన్న గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ప్రొటోకాల్ ను సయితం పాటించడం లేదని విమర్శలకు దిగుతున్నారు. ఈ బిల్లు అమలులోకి వచ్చిన వెంటనే బెంగాల్ యూనివర్సిటీలక మమత బెనర్జీ ఛాన్సిలర్ గా కొనసాగుతారు.


Tags:    

Similar News