క్రికెట్ ఆడుతూ నటుడు దీపేష్ మృతి
ప్రముఖ సీరియల్ భాబీజీ ఘర్ పర్ హైలో మల్ఖాన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న
ప్రముఖ బుల్లితెర నటుడు, కమెడియన్ దీపేష్ భాన్ కన్నుమూశారు. 41 సంవత్సరాల దీపేష్ శనివారం ఉదయం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉన్నట్లుండి ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీపేష్ మృతికి పలువురు సినీ, టీవీ నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన మరణవార్తను అసిస్టెంట్ డైరెక్టర్ కవిత కౌశిక్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీపేష్ హఠ్మారణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీపేష్ చాలా ఫిట్‌గా ఉంటారని, మద్యపానం, పొగతాగే అలవాట్లు కూడా లేవంటూ తెలిపారు.
ప్రముఖ సీరియల్ భాబీజీ ఘర్ పర్ హైలో మల్ఖాన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపేష్ భాన్ శనివారం ఉదయం మరణించారు. తన కెరీర్‌లో చిన్న తెరపై అనేక హాస్య పాత్రలు పోషించాడు. దివంగత నటుడి కుటుంబానికి ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. దీపేష్ భాన్ జిమ్‌లో వర్కవుట్ చేసిన తర్వాత, అతను క్రికెట్ మైదానానికి వెళ్లాడు, అక్కడ అతను కుప్పకూలిపోయాడు. అతని మరణానికి కారణం ఇంకా వైద్యులు స్పష్టం చేయలేదు. భాబీజీ ఘర్ పర్ హైన్‌తో పాటు, దీపేష్ భాన్ ఫల్తు ఉత్పతాంగ్ చుత్పతి కహానీ, మే ఐ కమ్ ఇన్ మేడమ్ వంటి కామెడీ షోలలో కూడా పనిచేశారు.