షివోమీకి ఈడీ షాక్.. కోట్ల నగదు సీజ్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం చరిత్రలో అతి పెద్దమొత్తంలో నగదును సీజ్ చేసిన సంఘటన జరిగింది

Update: 2022-09-30 12:38 GMT

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం చరిత్రలో అతి పెద్దమొత్తంలో నగదును సీజ్ చేసిన సంఘటన జరిగింది. చైనాకు చెందిన షివోమీ కంపెనీకి భారీ షాక్ తగిలింది. ఈ కంపెనీకి చెందిన 5,551 కోట్ల రూపాయల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు.

ఫెమా నిబంధనలను...
ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై విచారణ జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షివోమీ సెల్ కంపెనీకి చెందిన కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. సెల్ ఫోన్ల తయారీ కంపెనీగా షివోమీకి పేరుంది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాలకు నగదును మళ్లించిందన్న అభియోగాలున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీకి సంబంధించిన సొమ్మును ఈ కంపెనీ ఎగవేసిందన్న ఆరోపణలున్నాయి.


Tags:    

Similar News