సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయ భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేశారు. కార్యాలయ ప్రాంగణంలో అణువణువు తనిఖీలు నిర్వహించారు. తీవ్రవాద సంస్థ అల్ ఖైదా పేరుతో సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది.
అప్రమత్తమైన
దీనిపై సచివాలయంలో పోలీస్ స్టేసన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తరువాత ఏటీఎస్ కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఫోన్ చేశారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. ఆకతాయిలు చేసిన పనా? లేదా కావాలని చేసిన పనా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.