పసి బిడ్డ కడుపులో మరో పిండం.. వైద్యులే ఆశ్చర్యపోయారు..!
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శిశువు పొట్టలో గర్భస్థ శిశువు పెరుగుతోందని నిర్ధారించారు
కేవలం 40 రోజుల శిశువు కడుపులో పిండం వృద్ధి చెందింది. వైద్య పరంగా అత్యంత అరుదైన ఈ కేసు బిహార్‌లోని మోతిహారిలో వెలుగులోకి వచ్చింది. ఇటివల 40 రోజుల పసికందు పొట్ట ఉబ్బింది. మూత్రవిసర్జన సరిగా చేయలేకపోవడంతో ఆందోళనకు గురయిన తల్లిదండ్రులు బిడ్డను సమీపంలోని రహ్మానియా మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శిశువు పొట్టలో గర్భస్థ శిశువు పెరుగుతోందని నిర్ధారించారు. కంప్యూటెడ్ టొమోగ్రఫీ(సీటీ) స్కానింగ్ చేయగా ఈ విషయం బయటపడిందని వైద్యులు తెలిపారు. ఇది అత్యంత అరుదైన కేసుగా.. పుట్టుకతో వచ్చే అరుదైన ఈ వ్యాధిని 'పిండంలో పిండం' గా పిలుస్తారని వైద్యులు తెలిపారు. శిశువుకు వైద్యులు చికిత్స నిర్వహించారు. సర్జరీ చేసి పిండాన్ని తొలగించారు. బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉందని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు.