ముంబయి పోలీసుల ఎదుటకు నేడు కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నేడు ముంబై పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.;

Update: 2021-12-23 03:58 GMT
kangana ranaut, mumbai police, social media, comments
  • whatsapp icon

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నేడు ముంబై పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. సిక్కుల పై కామెంట్స్ చేసిన కంగనా రనౌత్ పై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారించేందుకు ముంబయిలోని ఖార్ పోలీస్ స్టేషన్ కు ీఈరోజు కంగనా రనౌత్ హాజరుకావాల్సి ఉంది.

రైతు ఉద్యమంపై.....
కంగనా రనౌత్ రైతుల ఉద్యమం విషయంలో సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దీనిపై సిక్కు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైతుల ఉద్యమాన్ని ఉగ్రవాదంతో పోల్చిన కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలో వివాదమయ్యాయి. ఈరోజు కంగనా రనౌత్ ముంబయి పోలీసుల ఎదుట విచారణకు హాజరై తన వివరణను ఇవ్వాల్సి ఉంటుంది.


Tags:    

Similar News