నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ లు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రభుత్వం సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది. రేపు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
కీలక బిల్లులను...
తొలిదశ పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకూ జరగనున్నాయి. రెండో విడత మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకూ కొనసాగుతుందని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ సమావేశాల్ో అనేక కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విపక్షాలు ప్రజా సమస్యలపై గళమెత్తాలని నిర్ణయించాయి. సభ లోపల, వెలుపల ఆందోళనకు విపక్షాలు దిగనున్నాయి. పెరుగుతున్న ధరలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ వంటి అంశాలపై విపక్షాలు ధ్వజమెత్తాలని నిర్ణయించుకున్నాయి.