గిరిజనుడిపై మూత్ర విసర్జన కేసు.. ఇల్లు కూల్చేసిన అధికారులు

ఆయన ఆదేశాలతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి..జాతీయ భద్రతా చట్టం, ఎస్సీ, ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసు..

Update: 2023-07-06 04:16 GMT

pravesh shukla house bulldozed

మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో వారంరోజుల క్రితం గిరిజన కార్మికుడి పై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వీడియో నెట్టింట ప్రకంపనలు సృష్టించింది. ఈ వీడియో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టిలో పడగా.. ఆయన ఆదేశాలతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి..జాతీయ భద్రతా చట్టం, ఎస్సీ, ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పర్వేశ్ శుక్లా రేవా సెంట్రల్ జైల్ లో ఉన్నాడు. ఆదివాసీపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అతని ఇంటిని బుల్డోజర్ తో కూల్చేశారు.

ఇల్లు కూలిపోవడాన్ని చూసి ప్రవేశ్ శుక్లా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడు నేరం చేశాడని చూపిస్తోన్న వీడియో చాలా పాతదని, ఎన్నికలు సమీపించడంతో రాజకీయ కారణాలతో దీన్ని బయటకు లాగారని ఆరోపించారు. ప్రవేశ్ శుక్లా అరెస్టైన సమయంలో అతని తండ్రి మాట్లాడుతూ.. తన కొడుకు అలాంటి నీఛమైన పని చేసే అవకాశమే లేదన్నారు. తన కుమారుడిపై ఏదో కుట్ర జరుగుతుందని, ఆ వీడియో చూశాక చాలా ఒత్తిడికి గురయ్యామన్నారు. కావాలనే ప్రవేశ్ పై ఇదంతా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






Tags:    

Similar News