కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రేషన్ కు బదులు నగదు?
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రేషన్ బియ్యానికి బదులుగా నగదు ఇచ్చేందుకు సిద్ధమయింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రేషన్ బియ్యానికి బదులుగా నగదు ఇచ్చేందుకు సిద్ధమయింది. రేషన్ బియ్యం పక్క దారి పడుతుండటంతో నగదు ను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రేషన్ బియ్యం ఎక్కువ శాతం ఇతర దేశాలకు ఎగుమతులు అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో...
అయితే సబ్సిడీ తో ఇచ్చే రేషన్ బియ్యానికి విలువ కట్టి అందుకు సమానమైన నగదును చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన నిర్ణయం త్వరలో వెలువడే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నారు. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.