Chandrayaan 3: మరో శుభపరిణామం..చంద్రయాన్‌ 3 నుంచి మళ్లీ సంకేతాలు..

Chandrayaan 3: గత ఏడాదిలో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌ 3 ప్రయోగం చేపట్టి విజయవంతం అయిన విషయం తెలిసిందే..

Update: 2024-01-21 05:32 GMT

Chandrayaan 3

Chandrayaan 3: గత ఏడాదిలో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌ 3 ప్రయోగం చేపట్టి విజయవంతం అయిన విషయం తెలిసిందే. చంద్రయాన్‌ 3 నుంచి ఎన్నో విషయాలను రాబట్టారు శాస్త్రవేత్తలు. చంద్రునిపై ల్యాండ్‌ అయిన తర్వాత కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేసింది. అయితే దక్షిణ ధ్రువంపై ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 నిద్రాణ స్థితిలోకి చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడ తీవ్రమైన చలి కారణంగా అందులో ఉన్న బ్యాటరీ సామర్థ్యం దెబ్బతిన్న విషయం తెలిసిందే.

అప్పటి నుంచి చంద్రయాన్‌ రోవర్‌ నిద్రావస్థలోకి జారుకుంది. అయితే చంద్రయాన్‌-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు బెంగళూరులో ధ్రువీకరించారు.

అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్‌-3 ల్యాండర్‌లో నాసాకు చెందిన లూనార్‌ రికనిసెన్స్‌ ఆర్బిటర్‌ LRO ను అమర్చారు. ఇందులోని లేజర్‌ రెట్రో రెఫ్లెక్టర్‌ ఎరే ఎల్ఆర్ఏ (LRA) జాబిల్లి దక్షిణ ధ్రువంలోని లొకేషన్‌ మార్కర్‌ సేవలను పునరుద్ధరించిందని వివరించారు. డిసెంబరు 12 నుంచి ఎల్ఆర్ఏ (LRA) నుంచి తమకు సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది.

చంద్రయాన్‌-3లో పలు సంస్థలకు చెందిన ఎల్ఆర్ఏ (LRA)లను అమర్చినా నాసాకు చెందిన ఎల్ఆర్ఏ (LRA) నిరంతరం పనితీరు కనబరుస్తూనే ఉందని వెల్లడించింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్ఆర్ఏ (LRA) పర్యవేక్షణ మొదలవుతుంది. చంద్రయాన్‌-3 నుంచి తూర్పు వైపునకు ఉన్న ఎల్ఆర్ఓ (LRO)లోని లేజర్‌ అల్టిమీటర్‌ చంద్రయాన్‌-3 ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి సంకేతాలు అందించగలుగుతుంది. ఇందులోని 8 పలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణానికి అనువుగా ఏర్పాటయ్యాయి. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే సామర్థ్యంతో రూపొందించారు.

Tags:    

Similar News