45 లక్షల రూపాయలున్న బ్యాగ్ ను అధికారులకు అందించిన ట్రాఫిక్ పోలీసు

45 లక్షల రూపాయలున్న బ్యాగ్ ను అధికారులకు అందించిన ట్రాఫిక్ పోలీసు

Update: 2022-07-24 08:55 GMT

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఓ ట్రాఫిక్ పోలీసు ఏకంగా 45 లక్షల రూపాయలను తిరిగి ఇచ్చేశాడు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో రూ.45 లక్షలతో కూడిన బ్యాగ్‌ను అందజేసి నిజాయితీని ప్రదర్శించాడని పోలీసులు ప్రశంసించారు. నవ రాయ్‌పూర్‌లోని కయాబంధ పోస్ట్‌కు అనుబంధంగా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలంబర్ సిన్హా రహదారిపై ఉదయం బ్యాగ్‌ను కనుగొన్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ సుఖానందన్ రాథోడ్ తెలిపారు. బ్యాగ్‌ని తనిఖీ చేయగా లోపల 2000, 500 నోట్లు రూ.45 లక్షలు ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి బ్యాగ్‌ని సివిల్‌లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో జమ చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. సీనియర్ అధికారులు సిన్హాకు రివార్డు ప్రకటించారు. నగదు ఎవరిదని తెలుసుకోవడానికి సివిల్ లైన్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారి తెలిపారు.

నయా రాజయ్ పూర్ లోని కయాబంధ పోస్ట్ కు అనుబంధంగా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలంబర్ సిన్హా.. రోడ్డుపై ఉదయం ఓ బ్యాగ్ ను చూశాడు. అందులో డబ్బులు ఉన్నట్లు తెలుసుకున్న ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ డబ్బును అప్పగించినట్లు ఎస్పీ సుఖానందన్ రాథోడ్ తెలిపారు. బ్యాగ్ ను తనిఖీ చేయగా.. మొత్తం రూ. 2000, రూ. 500 నోట్లలతో రూ. 45 లక్షలు కనిపించాయి. నిలంబర్ సిన్హాకు సీనియర్ అధికారులు రివార్డు ప్రకటించారు. నీలాంబర్ నిజాయితీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News