Children’s Day 2023: ఆయన పుట్టిన రోజు పిల్లలకు పండగ రోజు

భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం బాలల దినోత్సవంగా దేశమంతటా జరుపుతారు.;

Update: 2023-11-14 01:11 GMT
Children’s Day 2023, history, significance, celebration, jawaharlal nehru
  • whatsapp icon

భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం బాలల దినోత్సవంగా దేశమంతటా జరుపుతారు. జవహర్ లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న అలహాబాద్ లో జన్మించారు. ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధులు, కాంగ్రెస్ అధ్యక్షుడు. జవహర్ లాల్ నెహ్రూ లండన్ లో బారిస్టర్ పట్టా పొంది, 1912లో అలహాబాద్ న్యాయవాద వృత్తి ప్రారంభించారు.

1916 నుంచి కాంగ్రెస్ రాజకీయాలలో పాల్గొనడం ప్రారంభించి, 1929, 1936,1937,1951,1954లలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. గాంధీకి అభిమాన నాయకులైన నెహ్రూ స్వతంత్ర భారత ప్రధానిగా 1947 ఆగస్టు 15న బాధ్యతలు చేపట్టి 1964మే 27న మరణించారు. ఆయన మరణించే వరకు పదవిలో కొనసాగారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలోకి నడిపారు. అలీనోద్యమ నిర్మాతగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. వీరి కుమార్తె ఇందిరాగాంధీ, మనుమడు రాజీవ్ గాంధీ దేశ ప్రధానులుగా పదవులు చేపట్టారు. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరి (1934), జీవిత చరిత్ర (1936), ది డిస్కవరి ఆఫ్ ఇండియా (1946) గ్రంథాలు వీరి మేధాశక్తికి నిదర్శనాలు. పిల్లలచే చాచా నెహ్రూగా అభిమానించబడిన నెహ్రూ పుట్టిన రోజున దేశమంతటా బాలల దినత్సవం ఘనంగా జరుగుతుంది.

దేశ స్వాతంత్రం కోసం అవిశ్రాంతంగా కృషి చేసి, బ్రిటిష్ పాలకులు వెళ్లిపోయిన తరువాత భారతదేశ అభ్యున్నతికి ఎంతగానో సేవలందించిన పండిట్ నెహ్రూ 1964వ సంవత్సరంలో మరణించారు. ఆయన మరణించిన తరువాత ఆయనకు గౌరవంగా నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నేటి వరకు నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే నిర్వహించుకుంటున్నాము. అంతకు ముందు భారత దేశంలో కూడా చిల్డ్రన్స్ డే నవంబర్ 20వ తేదీన జరుపుకునేవారు. 1952, 1957, 1962లలో కూడా కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించి మొత్తం 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Tags:    

Similar News