బీహార్ లో కూలిన మరో వంతెన

బీహార్ లో మరో వంతెన కూలడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Update: 2024-08-17 07:09 GMT

బీహార్ లో మరో వంతెన కూలడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో వరసగా వంతెనలు కూలిపోతుండటంతో నాసిరకం నిర్మాణాలు చేపట్టినందునే వంతెనలు కూలిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఖగారియాలోని అగువానీ - సుల్తగంజ్ మధ్య గంగానదిపై నిర్మిస్తున్న నాలులేన్ల వంతెన పిల్లర్ స్లాబ్ నిర్మాణం కూలిపోవడం విమర్శలకు దారి తీసింది.

నిర్మాణంలో...
నిర్మాణంలో లోపాలు వంతెన కూలిపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. దీనిపై బీహార్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఎస్పీ సింగ్లా కంపెనీ దీనిని నిర్మిస్తుంది. ఈ వంతెన ఖగారియా, భాగల్‌పూర్ జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.


Tags:    

Similar News