పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర
ప్రభుత్వ చమురు కంపెనీలు కమర్శియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి.
ప్రభుత్వ చమురు కంపెనీలు కమర్శియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై ధర రూ.101.50 పెరిగింది. పండుగల సీజన్‌లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. తాజా పెంపుతో ఢిల్లీలో ప్రస్తుతం 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1833గా ఉంది. అంతకుముందు రూ.1731కి లభించేది. ముంబైలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1785.50కి అందుబాటులో ఉంది. కోల్‌కతాలో ధర రూ.1943కి పెరిగింది. చెన్నైలో ధర రూ.1999.50గా ఉంది.
అక్టోబర్‌లో ప్రభుత్వ చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.209 పెంచాయి. దీంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ముంబైలో రూ.1684, కోల్‌కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898కి చేరింది. సాధారణ ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.903కి అందుబాటులో ఉంది.