Priyanka Gandhi : వాయనాడ్ లో ప్రియాంక గాంధీ ముందంజ

వాయనాడ్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ముందంజలో ఉన్నారు

Update: 2024-11-23 03:39 GMT

వాయనాడ్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ముందంజలో ఉన్నారు. ప్రియాంక గాంధీ తన సమీప ప్రత్యర్థి పై ఇరవై వేల ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. పోస్టల్ బ్యాలట్ నుంచి ఇప్పుడు సాధారణ కౌంటింగ్ ప్రారంభమయింది. మొదటి రౌండ్ లో ప్రియాంక గాంధీ ముందంజలో ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు.

ఇరవై వేల ఓట్ల ఆధిక్యతతో...
ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. వాయనాడ్ లో బీజేపీ, కమ్యునిస్టు పార్టీలు పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి లీడ్ లో ఉన్నారు. రాను రాను మెజారిటీ పెరుగుతుందని చెబుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.



Tags:    

Similar News