బిల్లుకు మేం మద్దతు : సోనియా
మహిళ రిజర్వేషన్ బిల్లును గతంలో సభలో కొందరు అడ్డుకున్నారని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆరోపించారు
మహిళ రిజర్వేషన్ బిల్లును గతంలో సభలో కొందరు అడ్డుకున్నారని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆరోపించారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆమె ప్రసంగించారు. గతంలో ఈ బిల్లును అడ్డుకోవడం వల్లనే కార్యరూపం దాల్చలేక పోయిందన్నారు. స్త్రీల త్యాగాలు ఎనలేనివని సోనియా గాంధీ అన్నారు. భారతదేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. ఆధునిక నిర్మాణంలో పురుషులతో కలసి మహిళలు పోరాడారని సోనియా గాంధీ అన్నారు.
స్థానిక సంస్థల రిజర్వేషన్లను...
వంటిల్లు నుంచి ప్రపంచ వేదికల వరకూ మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని సోనియా గాంధీ అన్నారు. స్థానికసంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ కల్పించారని గుర్తు చేశారు. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడూ ఆలోచించరన్న సోనియా గాంధీ స్త్రీల త్యాగాలు ఎనలేనివని అన్నారు. సరోజినీ నాయుడు, సుజేత కృపాలని, ఇందిర గాంధీ, అరుణ అసఫ్ ఆలి, విజయలక్ష్మి పండిట్ వంటి వారు ఎంతో సేవలందించారని గుర్తు చేశారు. మహిళ రిజర్వేషన్ల బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని సోనియా గాంధీ స్పష్టం చేశారు.