Haryana Elections : హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఏమందంటే?
హర్యానాలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మీడియాతో మాట్లాceki
హర్యానాలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ హర్యానా ఎన్నికల ఫలితాలపై తమకు అనుమానాలున్నాయన్నారు. హర్యానాలోని మూడు జిల్లాల నుంచి తమకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందినట్లు జైరాం రమేష్ తెలిపారు. కొన్ని సందేహాలను తాము లేవనెత్తినా సమాధానం ఎన్నికల కమిషనర్ అధికారులు ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ఫలితాలను లాగేసుకున్నారంటూ...
తొలుత ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయని, తర్వాత రౌండ్ మారేసరికి ఫలితాలు బీజేపీకి అనుకూలంగా మారాయని జైరాం రమేష్ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ తమకు అనుకూలంగా వచ్చాయన్న ఆయన ఈ ఫలితాలను తాము అంగీకరించడం లేదన్నారు. ఇది తమకు సమ్మతం కాదని జైరాం రమేష్ తెలిపారు. కాంగ్రెస్ నుంచి విజయాన్ని లాగేసుకున్నారని అన్నాు. మార్పు కోరుకున్న ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని జైరాం రమేష్ తెలిపారు.