Rahul Gandhi : నేడు ఝార్ఖండ్‌లోకి రాహుల్ న్యాయ యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర నేడు ఝార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర నేడు ఝార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. సంతాల్ పరగణ జిల్లా నుంచి ఝార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఝార్ఖండ్ లోకి రాహుల్ యాత్ర ప్రవేశించే రెండో రోజుల ముందు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సంతాల్ పరగణలోని పాకూర్ మీదుగా ఝార్ఖండ్ లోకి భారత్ న్యాయయాత్ర ప్రవేశించనుంది.
సోరెన్ అరెస్ట్ విషయం...
దీంతో పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. గత నెల 14వ తేదీన మణిపూర్ లో ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ఈరోజు ఝార్ఖండ్ లోకి ప్రవేశించనుంది. సోరెన్ పై ఈడీ దాడుల విషయాన్ని కాంగ్రస్ నేత రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి. యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.