జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్
ఆర్మీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగింది
ఆర్మీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగింది. సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.
అగ్నిపథ్ ను నిరసిస్తూ....
అగ్నిపథ్ ను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా యువత నిరసనను వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా కొన్నేళ్లుగా శిక్షణ తీసుకుంటున్న ఆర్మీ ఉద్యోగులు తిరగబడతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలపై దాడికి దిగుతున్నారు. రైల్వేస్టేషన్లపై దాడి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను తగులపెడుతున్నారు. దీంతో అగ్నిపథ్ పై పునరాలోచించాలని, పథకాన్ని వెనక్కు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. జంతర్ మంతర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.