నెలల తర్వాత వెయ్యికి దిగువన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇండియా : భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాలా రోజుల తర్వాత వెయ్యికి తక్కువగా కేసులు నమోదయ్యాయి. 58 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,96,369 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
యాక్టివ్ కేసులు కూడా బాగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 12,054 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,29,839 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,416 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,85,53,86,260 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. పాజిటివిటీ రేలు 0.17 శాతానికి తగ్గడం శుభపరిణామం.